హాస్యనటుడిగా, హీరో, ప్రతినాయకుడిగా తెరపై మెరిసిన సునీల్.. ఎవరూ ఊహించని అవతారం ఎత్తబోతున్నారని సినీ వర్గాల సమాచారం. ఎప్పటి నుంచో దర్శకుడు కావాలనే ఆలోచనలో ఉన్న ఆయన త్వరలోనే మోగాఫోన్ పట్టుకోనున్నట్లు తెలిసింది. విజయవంతమైన ఓ మరాఠీ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.
ఆ సినిమా రీమేక్ హక్కులు సొంతం చేసుకుని, ఓ ప్రముఖ నిర్మాతతో సినిమా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. వచ్చే ఏడాదిలో చిత్రీకరణ ప్రారంభకానుందని వినికిడి. ఇప్పటికే కొందరు నాయకులు దర్శకులుగా మారి ఆకట్టుకున్నారు. మరి సునీల్ ఎలా అలరిస్తారో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
ప్రస్తుతం వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు సునీల్. సలోని నాయిక. ఎలాంటి ప్రకటన లేకుండానే సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా.. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది.
ఇదీ చూడండి : 'మర్యాద రామన్న' జోడీ మరోసారి?