ETV Bharat / sitara

తెలుగులో ఇలాంటి సినిమాలు అరుదు: సుమంత్​ అశ్విన్​ - సుమంత్ అశ్విన్ తాజా వార్తలు

'లవర్స్', 'కేరింత', 'ప్రేమకథాచిత్రమ్​ 2' లాంటి చిత్రాలతో అలరించాడు యువనటుడు సుమంత్​ అశ్విన్(Sumanth Ashwin Movies). ఆయన నటించిన 'ఇదే మా కథ' చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆ చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే..

sumanth ashwin
సుమంత్​ అశ్విన్
author img

By

Published : Sep 30, 2021, 6:49 AM IST

"నటుడిగా చేసిన ప్రతి సినిమా ఓ కొత్త రకమైన అనుభవాన్నిచ్చింది. అందులో ఈ చిత్రం ఇచ్చిన అనుభవం చాలా ప్రత్యేకం" అన్నారు యువ హీరో సుమంత్‌ అశ్విన్‌(Sumanth Ashwin Movies). ఆయన.. శ్రీకాంత్‌, భూమిక, తాన్య హోప్‌లతో కలిసి నటించిన చిత్రం 'ఇదే మా కథ'(Idhe Maa Katha Release Date). గురుపవన్‌ దర్శకుడు. ఈ చిత్రం అక్టోబర్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుమంత్‌ అశ్విన్‌(Sumanth Ashwin New Movie) బుధవారం మీడియాతో మాట్లాడారు.

"తెలుగులో రహదారి ప్రయాణం నేపథ్యంలో చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి. దర్శకుడు గురు ఈ కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. హైదరాబాద్‌ నుంచి లద్దాఖ్‌ వరకు సాగే ప్రయాణం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. నేనొక యూట్యూబర్‌గా, సాహసాలు అంటే ఇష్టపడే కుర్రాడిగా కనిపిస్తా. నాలుగు కథల సమాహారం ఈ చిత్రం. నలుగురికీ నాలుగు లక్ష్యాలు ఉంటాయి. అందరూ లద్దాఖ్‌కు బయల్దేరతారు. అలా వెళ్లిన ఆ నలుగురూ ఎక్కడ కలిశారు? కలిశాక వాళ్ల మధ్య ఎలాంటి అనుబంధం ఏర్పడింది? ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరం. 'ఇదే మా కథ'(Idhe Maa Katha Release Date) మనందరి కథలాగా ఉంటూ మనసులకి హత్తుకుంటుంది" అన్నాడు.

"బైక్‌ నడపడం స్వతహాగా నాకు ఇష్టం. ఇక లద్దాఖ్‌ తరహా ప్రాంతాల్లో బైక్‌ రైడింగ్‌ మరింత కిక్‌నిస్తుంది. రోడ్లపై బైక్‌ ప్రయాణం బాగుంటుంది కానీ లద్దాఖ్‌లో మంచుపైన రైడింగ్‌ చేయాల్సి వచ్చింది. మేం ఈ సినిమా కోసం మైనస్‌ ఏడు డిగ్రీల్లో చిత్రీకరణ చేశాం. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. భూమిక తన పాత్ర సహజంగా రావాలని ఆమెనే స్వయంగా బైక్‌ రైడ్‌ చేస్తూ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఆమె నా బైక్‌ ఎక్కే సన్నివేశం చేసినప్పుడు ఉద్వేగానికి గురయ్యా. తెరపై చూస్తున్నప్పుడు కూడా అదే అనుభూతి కలుగుతుంది. తాన్య హోప్‌కీ, నాకూ మధ్య సాగే ప్రేమకథ చాలా సహజంగా ఉంటుంది".

-- సుమంత్ అశ్విన్(Sumanth Ashwin New Movie), యువనటుడు

"ఇటీవల 'సెవెన్‌ డేస్‌ సిక్స్‌ నైట్స్‌' సినిమా చేశాను. ఆ సినిమాకు నేను నిర్మాతను కూడా. ఆ బాధ్యత గురించి నాకు ముందే తెలుసు. ఆ కష్టం ఈ సినిమాతో మరింత బాగా అర్థమైంది. కామెడీ, ఓ మంచి డ్రామాతో తెరకెక్కిన చిత్రమది.అక్టోబర్‌ 22న మరో కొత్త సినిమా మొదలవుతుంద"ని వివరించాడు.

"పెళ్లి తర్వాత జీవితంలో మార్పంటూ ఏమీ లేదు. నా భార్య అమెరికాలో రీసెర్చ్‌ సైంటిస్ట్‌. పెళ్లి తర్వాత ఒక నెల భారత్​లో ఉన్నారు. ఆ తర్వాత అమెరికా వెళ్లారు. ఆరు నెలల తర్వాత మళ్లీ వస్తారు. కొవిడ్‌ వల్ల అమెరికాలో యాత్రికులకు అనుమతులు లేవు కదా. అందుకే నేను వెళ్లలేకపోయా" అన్నాడు సుమంత్​ అశ్విన్​(Sumanth Ashwin New Movie).

ఇదీ చదవండి: ఆమె నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి : బన్నీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.