ETV Bharat / sitara

'వి'లో మేం కాదు.. మా పాత్రలే పోటీపడతాయి - nani nivetha thomas

'వి' సినిమా విశేషాలు చెప్పిన కథానాయకుడు సుధీర్​బాబు.. తమ పాత్రలు పోటీపడి నటిస్తాయని అన్నారు. నివేదాతో కెమిస్ట్రీ బాగా పండిందని తెలిపారు. త్వరలో కొత్త ప్రాజెక్టుల వివరాలు వెల్లడిస్తానని వెల్లడించారు.

'వి'లో మేం కాదు.. మా పాత్రలే పోటీపడతాయి
నటుడు సుధీర్​బాబు
author img

By

Published : Sep 3, 2020, 7:00 AM IST

"యాక్షన్‌ సినిమా కాబట్టి దీన్ని థియేటర్లో విడుదల చేయాలనే ప్రణాళిక వేసుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీ మంచి ఎంపిక. దానికి అనువుగా ఉండేలా సినిమాలో కొన్ని మార్పులూ చేశాం. ఈ వేదిక ద్వారా థియేటర్లో కంటే ఎక్కువ మంది సినిమా చూసే వీలు కలుగుతుంది. సుమారుగా 200 దేశాలకు తెలుగు సినిమా పరిశ్రమ విస్తరిస్తుంది" అని కథానాయకుడు సుధీర్‌బాబు అంటున్నారు. త్వరలో 'వి'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో సినిమా విశేషాలు పంచుకున్నారు.

కథాబలం ఉన్న యాక్షన్‌ సినిమా. ఇందులో ఓ రక్షకుడు, ఓ రాక్షసుడు ఉంటారు. ఈ రెండు ప్రధాన పాత్రలు వాళ్లు నమ్మినదాని కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. రెండింటికీ ప్రత్యేకత ఉంటుంది. ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన ఓ పోలీసు అధికారికి ఓ కిల్లర్‌ సవాల్‌ విసురుతాడు. అతన్ని ఆ అధికారి ఆపగలడా.. లేదా అనేదే కథాంశం. సినిమాలో నేను, నాని పోటీ పడటం లేదు. మా పాత్రలే పోటీ పడతాయి.

actor sudheer babu
'వి' సినిమాలో నాని-సుధీర్​బాబు

అప్పుడే ప్రారంభం

నేను బ్యాడ్మింటన్‌ ఆటగాడిని. సినిమాల్లో విజయం సాధిస్తానా? విఫలమవుతానా? అని నేనెప్పుడూ ఆలోచించలేదు. సినిమాలంటే ఇష్టం. చేస్తున్నాం! అని అనుకుంటా. చిత్రపరిశ్రమకు నేను ఓ అంచనా వేసుకుని రాలేదు. పుల్లెల గోపీచంద్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే సినిమా కొన్ని కారణాలతో వెనక్కి వెళ్తోంది. చిత్రీకరణ డిసెంబర్‌లో ప్రారంభం అవుతుందని అనుకుంటున్నా. ఇది పాన్‌ ఇండియా చిత్రం.

ఆ సన్నివేశాలు బాగా పండాయి

నాకు, హీరోయిన్ నివేదా థామస్‌కు మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అంతేకాదు.. హీరోహీరోయిన్ల మధ్య ఉండే సీన్ల కంటే... హీరో, విలన్‌ మధ్య ఉండే సన్నివేశాలే బాగా పండాయి. ఇక అదితీరావ్‌ ఇందులో బాగా నటించింది. ఆమె ప్రతికూల పాత్రలో నటిస్తుందో... సానుకూల పాత్రలో మెప్పిస్తుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

actor sudheer babu
కథానాయకుడు సుధీర్​బాబు

ఆ హడావిడి ఆయనదే

ఇంద్రగంటితో పనిచేయడం వల్ల నటుడిగానే కాదు.. వ్యక్తిగానూ ఎదుగుతాం. సినిమా కోసం ఆయన నటుల్ని ఎంతో సన్నద్ధం చేస్తారు. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సెట్‌లో మంచి వాతావరణం ఉండేలా చూసుకుంటారు. చిత్రీకరణ సమయంలో నటీనటులు ప్రశాంతంగా కనిపించినా...దర్శకుడిగా టెన్షన్‌ అంతా ఆయనే తీసుకుంటారు.

రెండు రోజులకు ఓ కథ

ఈ లాక్‌డౌన్‌ సమయంలో పెండింగ్‌లో ఉన్న సినిమాలు చూసే అవకాశం కలిగింది. రెండు రోజులకు ఒక కథ చొప్పున వినేవాడిని. అందులో రెండింటికి ఓకే చెప్పా. వీటి వివరాలను త్వరలో నిర్మాణ సంస్థలు వెల్లడిస్తాయి. నా నిర్మాణ సంస్థలోనూ వెబ్‌ సిరీస్‌లు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నా. డిజిటల్‌ తెరలపై నటించడానికి నాకెటువంటి అభ్యంతరం లేదు. మంచి నిర్మాణ సంస్థ, బడ్జెట్‌ కుదిరితే ఏ మాత్రం ఆలోచించను.

actor sudheer babu
'వి' సినిమాలో సుధీర్​బాబు

చొక్కా తీస్తే కండలు

సినిమాలో నా ఇంట్రడక్షన్‌ ఫైట్‌ బాగుంటుంది. సినిమా కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలనే అనుకున్నాం. ఫైట్‌ మాస్టర్‌ రవి వర్మ దాన్ని ప్రత్యేకంగా చేయించారు. 'చొక్కా వేసుకుంటే నీకు బాడీ ఉన్న విషయం తెలియకూడదు. చొక్కా తీసేస్తే కండలు ఉన్న విషయం తెలియాలి. కొంచెం స్టెబిలిటీగా ఉండాలి' అని దర్శకుడు చెప్పారు. నేను సాధారణంగా శరీరాన్ని ఫిట్‌గానే ఉంచుకుంటా. దీనికోసం బ్రాడ్‌పిట్‌ నటించిన 'ఫైట్‌ క్లబ్‌' తరహాలో చాలా ఫిట్‌గా ఉండాలని ఆయన చెప్పారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.