ETV Bharat / sitara

MAA Elections: 'మా' ఎన్నికల బరిలో రఘుబాబు - MAA Elections

పలు సినిమాల్లో హాస్య, సీరియస్​ పాత్రలతో మెప్పించిన రఘుబాబు.. మా ఎన్నికల బరిలో ఉన్నారు. మంచు విష్ణు ప్యానల్​(manchu vishnu panel list) తరఫున ఆయన పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Actor Raghu Babu
రఘుబాబు
author img

By

Published : Sep 18, 2021, 2:12 PM IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్టోబర్‌ 10న జరిగే ఈ ఎన్నికల కోసం అధ్యక్ష అభ్యర్థులగా మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ పోటాపోటీగా తలపడుతున్నారు. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌ తన ప్యానల్‌ ప్రకటించగా.. తాజాగా విష్ణు ప్యానల్‌ నుంచి ఓ కీలక నటుడి పేరు బయటకు వచ్చింది.

నటుడు రఘుబాబు ప్రధాన కార్యదర్శి పదవి కోసం విష్ణు ప్యానల్‌ నుంచి పోటీలోకి దిగుతున్నారు. ఈ మేరకు ఆయన జనరల్‌ సెక్రటరీగా విజయం సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు, జనరల్‌ సెక్రటరీ పదవి కోసం ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి జీవిత పోటీ పడతుండగా, బండ్ల గణేశ్‌ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.