బాలీవుడ్ ప్రముఖ నటుడు పరేశ్ రావల్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. తాజాగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఈమేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి.ఈ ఇనిస్టిట్యూట్‌కు ఛైర్మన్‌గా ఎంపికవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు పరేశ్.
ఈ పదవి 2017 నుంచి ఖాళీగా ఉంది. తాజాగా ఈ పోస్ట్‌కు ఎంపికైన రావల్.. నాలుగేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ పదవి ఛాలెంజింగ్‌గా ఉన్నప్పటికీ సరదాతో కూడుకున్నదని తెలిపారు. తనకు తెలిసిన రంగంలో ఇలాంటి గొప్ప బాధ్యతలు నిర్వర్తించడం సంతోషంగా ఉందని వెల్లడించారు.
'హేరా ఫేరి', 'అతిథి తుమ్ కబ్ జావోగే', 'ఓ మై గాడ్ వంటి' చిత్రాలతో మెప్పించారు పరేశ్ రావల్. తెలుగులో 'శంకర్ దాదా ఎంబీబీఎస్' సినిమాలో తన నటనతో కడుపుబ్బా నవ్వించారు.