Actor Mammootty News: మలయాళ ప్రముఖ నటుడు మమ్ముట్టి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. దొంగతనం చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో స్థానికుల చేతిలో హత్యకు గురైన ఆదివాసి వ్యక్తి మధు కుటుంబానికి న్యాయపోరాటంలో సాయం అందించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు కేరళ న్యాయశాఖ మంత్రి పీ.రాజీవ్‌ను కూడా కలిశారని మమ్ముట్టి ఛారిటీ వ్యవహారాలను చూసుకునే రాబర్ట్ కురియకోస్ వెల్లడించారు. ఫేస్బుక్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టారు.
'బాధితుడు కుటుంబానికి న్యాయపరమైన సాయం అందించేందుకు ప్రభుత్వ న్యాయవాదిని నియమిస్తామని న్యాయశాఖ మంత్రి అన్నారు. దీనికి బాధితుడి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు' అని రాబర్ట్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇదీ జరిగింది..
2018 ఫిబ్రవరిలో పాలక్కడ్ జిల్లా అట్టప్పడి ప్రాంతానికి చెందిన మధు అనే ఆదివాసిని స్థానికులు దారుణంగా కొట్టారు. దొంగతనం చేశాడనే ఆరోపణల నేపథ్యంలో అతడిని చావబాదగా.. మధు అక్కడిక్కడే మృతిచెందాడు. అయితే ఈ కేసు విచారణ జాప్యమైన కారణంగా బాధితుడి కుటుంబానికి సాయమందించేందుకు మలయాళ మెగాస్టార్ ముందుకొచ్చారు.
బాధిత కుటుంబానికి ఎట్టిపరిస్థితుల్లోనైనా చట్టపరమైన సాయం అందించాలని మమ్ముట్టి తమ ఛారిటీ సభ్యులకు తెలిపారు. కేరళ హైకోర్టు న్యాయవాది పీ నందకుమార్‌ను బాధిత కుటుంబానికి లీగల్ అడ్వైస్ ఇచ్చేందుకు నియమించినట్లు తెలిసింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: