బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ కరోనా బారినపడింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపిందీ నటి. కొన్ని రోజులగా ఒంట్లో నలతగా ఉండటం వల్ల టెస్టు చేయించుకున్నానని, అందులో పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని వెల్లడించింది. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నానని తెలిపింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"కొద్ది రోజులుగా చాలా అలటగా, కళ్లు మండుతూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ వెళదామని కరోనా టెస్టు చేయించుకున్నా. అందులో పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నా. త్వరలోనే దీని నుంచి బయటపడతా. ఎవ్వరూ భయపడొద్దు. మీరు భయపడితే అది భయపెడుతుంది. రండి ఈ చిన్న ఫ్లూ వైరస్‌ను తరమికొడదాం హర్ హర్ మహాదేవ్."
-కంగనా రనౌత్, నటి
కంగనా రనౌత్.. ప్రస్తుతం నిర్మాతగా డిజిటల్ మాధ్యమంలోనూ మెప్పించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. 'టికు వెడ్స్ షేరు' అనే లవ్‌స్టోరీని నిర్మిస్తున్నట్లు తెలిపింది. తన నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్స్ పేరు పెట్టడం సహా లోగో ఫొటోను పంచుకుంది.