ETV Bharat / sitara

'నాట్యం' చిత్రబృందానికి వెంకయ్యనాయుడు, బాలయ్య ప్రశంసలు - నాట్యం మూవీ రివ్యూ వెంకయ్యనాయుడు

ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నిర్మించి, నటించిన చిత్రం 'నాట్యం'(natyam movie review). ఈ సినిమా నేడు (అక్టోబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నటుడు బాలకృష్ణ.

Natyam movi
నాట్యం
author img

By

Published : Oct 22, 2021, 5:44 PM IST

'నాట్యం'(natyam movie review) చిత్రబృందానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, నటుడు బాలకృష్ణ(balakrishna natyam movie) శుభాకాంక్షలు తెలిపారు. నటి సంధ్యారాజుని సత్కరించారు. ఈ సినిమా నేడు (అక్టోబర్ 22) థియేటర్లలో విడుదలైన(నాట్యం సినిమా రివ్యూ) సందర్భంగా ఓ ట్వీట్ చేశారు వెంకయ్యనాయుడు.

"నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్య కళాకారిణి సంధ్యారాజు నటించిన 'నాట్యం' చక్కని చిత్రం. భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్లకు కట్టేలా ఈ సినిమాని రూపొందించిన దర్శకుడు రేవంత్‌ కోరుకొండ, నటీనటులకు అభినందల" అని ట్వీట్‌ చేశారు.

  • నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్యకళాకారిణి శ్రీమతి సంధ్యారాజు ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘నాట్యం’ చక్కని చిత్రం. భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్ళకు కడుతూ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రేవంత్ కోరుకొండ, ఇతర నటీనటులకు అభినందనలు. #Natyam pic.twitter.com/o6A8v23f1d

    — Vice President of India (@VPSecretariat) October 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదో కళాఖండం : బాలకృష్ణ

'నాట్యం' స్పెషల్‌ షో చూసిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ(balakrishna natyam movie) చిత్రబృందానికి అభినందలు తెలిపారు. ఈ చిత్రం ఓ కళాఖండం అని ప్రశంసించారు. "నాట్యం.. ఇది సినిమా కాదు. ఓ కళాఖండం. మరుగునపడుతోన్న కళను తెరపైకి తీసుకొచ్చి, భావితరాలకు అందించే ప్రయత్నం చేశారు. దర్శకుడు రేవంత్‌ తాను అనుకున్న కథని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. నటులంతా తమతమ పాత్రలో ఒదిగిపోయారు. ప్రతి సన్నివేశం రక్తికట్టించేలా ఉంది. ఇలాంటి మంచి సినిమాను అందించినందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా" అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆదిత్యా మేన‌న్‌, రోహిత్ బెహ‌ల్‌, క‌మ‌ల్ కామ‌రాజు, భానుప్రియ‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్రావణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు. విడుదలైన ప్రతిచోటా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

ఇవీ చూడండి: 'నటుడు వివేక్ మృతికి వ్యాక్సిన్ కారణం కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.