హీరో బాలకృష్ణ.. ఆదివారం సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నాడు. ఇతడితో పాటు హీరోయిన్ వేదిక ఉంది. వీరిద్దరూ కలిసి 'రూలర్'లో నటించారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. విశాఖపట్నంలో శనివారం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సినిమాలో ధర్మ అనే పోలీస్ అధికారిగా బాలకృష్ణ కనిపించనున్నాడు. సోనాల్ చౌహాన్ మరో కథానాయికగా నటించింది. చిరంతన్ భట్ సంగీతమందించాడు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే విడుదలైన పాటలు, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.

ఇది చదవండి: బాలకృష్ణకు విలన్గా ఫైర్ బ్రాండ్ రోజా!