ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీ.. పోస్ట్ తొలగించిన నటి - ఆర్ఆర్ఆర్ రామ్​చరణ్ ఎన్టీఆర్

'ఆర్ఆర్ఆర్' రిలీజ్​ తేదీ అంటూ ఇన్​స్టాలో పొరపాటున పోస్ట్ చేసిన నటి అలీసన్ డూడీ.. వెంటనే దానిని తొలగించింది. అయితే ఆ తేదీనే సినిమా వస్తుందేమోనని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.

actor Alison Doody mistakenly posted 'RRR' release date on Instagram
'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీ.. పోస్ట్ తొలగించిన నటి
author img

By

Published : Jan 23, 2021, 4:26 PM IST

అభిమానులంతా టాలీవుడ్​ పెద్ద సినిమాల అప్‌డేట్‌లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌' గురించి ఒక విషయం బయటికి వచ్చింది.

ఈ సినిమాలో నటిస్తున్న ఐరిష్‌(ఐర్లాండ్‌) నటి అలిసన్‌ డూడీ ఇన్‌స్టాలో ఓ పోస్టు చేసింది. అందులో 'ఆర్‌ఆర్‌ఆర్‌'.. ఈ ఏడాది అక్టోబర్‌ 8న విడుదల కానుందంటూ ప్రకటించింది. ఆ పోస్టు వైరల్‌ కాకముందే వెంటనే తొలగించింది. ఆమె అనుకోకుండా చేసిన ఆ పోస్టులో నిజమెంత? అనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటించే వరకూ ఆగాల్సిందే.

'RRR' release date
ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్-తారక్

సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా జూ.ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్‌దేవగణ్‌, రే స్టీవెన్‌సన్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్​ జరుగుతోంది.

ఇది చదవండి: 'ఆర్ఆర్ఆర్' నుంచి క్రేజీ అప్​డేట్.. ఫొటో ట్వీట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.