ETV Bharat / sitara

Jacqueline: హీరోయిన్ జాక్వెలిన్​.. ఆ వ్యాపారవేత్తతో లివ్ ఇన్​లో! - Actesses Jacqueline Fernandez latest news

బాలీవుడ్​ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez ) దక్షిణాదికి చెందిన వ్యాపారవేత్తతో డేటింగ్​లో ఉన్నట్లు టాక్. వీరిద్దరూ త్వరలో అత్యంత ఖరీదైన అపార్ట్​మెంట్​ను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది.

Jacqueline
జాక్వెలిన్..
author img

By

Published : Jun 17, 2021, 4:15 PM IST

బాలీవుడ్​ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్​కు(Jacqueline Fernandez ) సంబంధించిన ఓ వార్త చిత్రసీమలో చక్కర్లు కొడుతోంది. ఈ భామ దక్షిణ భారతదేశానికి చెందిన ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో పడిందని, వీరిద్దరి కలిసి ముంబయిలోని ఖరీదైన జుహు ప్రాంతంలో ఓ అపార్ట్​మెంట్​ కొనుగోలు చేయబోతున్నారని వినికిడి. దీని విలువ రూ.175 కోట్లు ఉంటుందని తెగ చర్చించుకుంటున్నారు. ఇది నిజమో కాదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

జాక్వెలిన్​ వరుస సినిమాలతో బిజీగా ఉంది. 'సాహో'లో(Saaho) ప్రత్యేక గీతంలో తెలుగువారికి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. పవన్​కల్యాణ్(Pawankalyan)​ 'హరిహర వీరమల్లు'(Harihari veeramallu) సినిమాలో రాజకుమారిగా పూర్తిస్థాయి పాత్రలో నటిస్తోంది. వీటితో పాటు 'ఎటాక్'​, 'భూత్​పోలీస్'​, 'సర్కస్​', 'బచ్చన్​ పాండే', 'రామ్​సేతు' సినిమాల్లోనూ హీరోయిన్​గా చేస్తోంది.

ఇదీ చూడండి: హీరోయిన్ జాక్వెలిన్ ఉదయాన్నే గుర్రపుస్వారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.