ETV Bharat / sitara

చిరు లేకుండానే 'ఆచార్య' షూటింగ్ షురూ!​ - చిరంజీవి వార్తలు

మెగాస్టార్​ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. చిరంజీవికి ఇటీవలే కరోనా సోకడం వల్ల చిత్రీకరణ ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. అయితే మిగిలిన నటీనటులతో చిత్రీకరణను దర్శకుడు పునఃప్రారంభించారు.

Acharya shooting resumes without Chiranjeevi as he tests positive for Covid-19
చిరుకు కరోనా వచ్చినా 'ఆచార్య' షూటింగ్​ ఆగలేదు
author img

By

Published : Nov 12, 2020, 9:06 PM IST

Updated : Nov 12, 2020, 9:38 PM IST

మెగాస్టార్​ చిరంజీవి - కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పునఃప్రారంభమైంది. వాస్తవానికి ఈ నెల 9న పునఃప్రారంభించాల్సిన చిత్రం చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడం వల్ల నిలిచిపోయింది.

ఈ క్రమంలో కొంత ఆందోళనకు గురైన చిత్ర బృందం.. ముందస్తుగా అనుకున్న సమయానికే మళ్లీ 'ఆచార్య' సెట్​లోకి అడుగుపెట్టింది. ఇక నుంచి ఏకధాటిగా సినిమా పూర్తయ్యేంత వరకు చిత్రీకరణ జరపనున్నట్లు దర్శకుడు కొరటాల శివ తెలిపారు. అయితే కరోనా కారణంగా చిత్రీకరణకు చిరంజీవి దూరంగా ఉండటం వల్ల కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మిగతా నటీనటులకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

Last Updated : Nov 12, 2020, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.