కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆచార్య' సినిమాలోని హీరో రామ్‌చరణ్ లుక్ విడుదలైంది. ఇందులో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. ప్రస్తుతం మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణ జరుపుకొంటోందీ చిత్రం. వేసవి కానుకగా మే 13న విడుదల కానుందీ మూవీ.
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.. షారుక్ ఖాన్ బ్యానర్ రెడ్ చిల్లీస్‌లో ఓ సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ఆలియా కూడా నిర్మాతగా భాగస్వామ్యం కానున్నారు. 'డార్లింగ్స్' టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. జస్మీత్ కే రీన్ దర్శకత్వం వహించబోయే ఈ సినిమాలో విజయ్ వర్మ, రోషన్ మాథ్యూ కీలకపాత్రలు పోషించనున్నారు.
-
#SRK ANNOUNCES NEW FILM... STARS ALIA BHATT, WHO ALSO TURNS PRODUCER... #AliaBhatt, #ShefaliShah, #VijayVarma and #RoshanMathew star in #Darlings... Directorial debut of Jasmeet K Reen... Produced by Gauri Khan, Alia Bhatt and Gaurav Verma... Starts this month. pic.twitter.com/RonBvGXpq5
— taran adarsh (@taran_adarsh) March 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#SRK ANNOUNCES NEW FILM... STARS ALIA BHATT, WHO ALSO TURNS PRODUCER... #AliaBhatt, #ShefaliShah, #VijayVarma and #RoshanMathew star in #Darlings... Directorial debut of Jasmeet K Reen... Produced by Gauri Khan, Alia Bhatt and Gaurav Verma... Starts this month. pic.twitter.com/RonBvGXpq5
— taran adarsh (@taran_adarsh) March 1, 2021#SRK ANNOUNCES NEW FILM... STARS ALIA BHATT, WHO ALSO TURNS PRODUCER... #AliaBhatt, #ShefaliShah, #VijayVarma and #RoshanMathew star in #Darlings... Directorial debut of Jasmeet K Reen... Produced by Gauri Khan, Alia Bhatt and Gaurav Verma... Starts this month. pic.twitter.com/RonBvGXpq5
— taran adarsh (@taran_adarsh) March 1, 2021
దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి, కథానాయకుడు సుధీర్ బాబు కాంబినేషన్‌లో రానున్న మూడో చిత్రం టైటిల్ ఖరారైంది. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' పేరుతో ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 'సమ్మోహనం', 'వి' చిత్రాల తర్వాత మరోసారి కలిసి పనిచేయబోతున్నారు సుధీర్-మోహనకృష్ణ. బెంచ్ మార్క్ స్డూడియోస్ పతాకంపై నిర్మితమవుతున్న తొలి చిత్రం ఇది. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది.