ETV Bharat / sitara

'‌విజయ్​ కుమార్తె గురించి అసభ్యంగా మాట్లాడింది నేనే' - విజయ్​ సేతుపతి అత్యాచార బెదరింపులు

ప్రముఖ నటుడు విజయ్​ సేతుపతి కుమార్తెపై అత్యాచార బెదరింపులు చేసింది తానేనని, క్షమించాలంటూ శ్రీలంకకు చెందిన ఓ యువకుడు నెట్టింట్లో ఓ వీడియో పోస్ట్​ చేశాడు. మానసికంగా ఒత్తిడికి గురై ఆ వ్యాఖ్యలు చేశానని అన్నాడు.

vijay sethupathi
విజయ్‌
author img

By

Published : Oct 27, 2020, 6:35 PM IST

ప్రముఖ కథానాయకుడు విజయ్‌ సేతుపతి కుమార్తెకు ఇటీవల అత్యాచార బెదిరింపులు రావడం అందర్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ్యంలో విజయ్‌కు మద్దతుగా అనేక మంది ప్రముఖులు మాట్లాడారు. అయితే తాజాగా "ఆ అత్యాచార బెదరింపులు చేసింది నేనే.. క్షమించండి" అంటూ శ్రీలంకకు చెందిన ఓ యువకుడు వీడియో పోస్ట్​ చేశాడు.

"విజయ్‌ సేతుపతి కుమార్తెను ఉద్దేశిస్తూ అసభ్యంగా కామెంట్లు చేసింది నేనే. కరోనా సంక్షోభంలో ఉద్యోగం కోల్పోయిన బాధలో, చిరాకులో ఉన్నాను. దీంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యా. శ్రీలంక సివిల్‌ వార్‌ గురించి ప్రస్తావించే సినిమాలో విజయ్‌ సేతుపతి నటిస్తున్నాడని తెలిసి కోపం వచ్చింది. నేను చేసింది తప్పని నాకు తెలుసు. నేను కఠిన శిక్షకు అర్హుడిని. నా కుటుంబానికి సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో వీడియోలో నా ముఖాన్ని బ్లర్‌ చేశా. విజయ్‌ సేతుపతి నన్ను తన సోదరుడిలా భావించి, క్షమించాలని కోరుతున్నా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళులు, మీడియా నన్ను క్షమించాలి" అని అతడు వేడుకున్నాడు.

విజయ్..‌ శ్రీలంక క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ '800'లో నటిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే గతంలో మురళీధరన్‌ ఓ వర్గంపై చేసిన వ్యాఖ్యల కారణంగా '800'లో విజయ్‌ నటించడాన్ని కొన్ని వర్గాలు తప్పుపట్టాయి. దీంతో ఈ చిత్రం రాజకీయంగా వివాదంలో చిక్కుకుంది. తమిళనాడుకు చెందిన అనేక రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల మధ్య విజయ్‌ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారు. ఈ క్రమంలో శ్రీలంకకు చెందిన సదరు యువకుడు హద్దుమీరి వ్యాఖ్యలు చేశాడు. అతడిపై తమిళనాడు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

ఇదీ చూడండి సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.