ETV Bharat / sitara

'నారప్ప', 'దృశ్యం2' ఓటీటీ డీల్​ ఎంతంటే? - వెంకటేష్​ నారప్ప

కథానాయకుడు వెంకటేశ్​(Venkatesh) నటించిన రీమేక్​ చిత్రాలు 'నారప్ప', 'దృశ్యం2'. ఈ సినిమాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయ్యి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లు ఇంకా తెరుచుకోని కారణంగా 'నారప్ప'(Narappa) చిత్రం ఇప్పటికే ఓటీటీ బాట పట్టింది. ఈ నేపథ్యంలో 'దృశ్యం2' కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందని టాలీవుడ్​లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాల కోసం దాదాపుగా రూ.75 కోట్లకుపైగా డీల్​ కుదిరినట్లు తెలుస్తోంది.

Above 70 Crore Deal For Narappa, Drishyam 2?
'నారప్ప', 'దృశ్యం2' ఓటీటీ డీల్​ ఎంతంటే?
author img

By

Published : Jul 14, 2021, 8:46 AM IST

వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌(Venkatesh). ఆయన నటించిన 'నారప్ప' (Narappa), 'దృశ్యం2' (Drishyam 2 Remake) చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమయ్యాయి. 'నారప్ప' అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా జులై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలుత ఈ సినిమాను థియేటర్‌లో విడుదల చేయాలని భావించినా, కరోనా పరిస్థితుల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఓటీటీ వేదికగా తీసుకొస్తున్నారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. వెంకీ నటించిన ఈ రెండు సినిమాల ఓటీటీ బిజినెస్‌ ద్వారా మంచి ప్రాఫిట్‌ లభించిందని టాలీవుడ్‌ టాక్‌. 'నారప్ప' కోసం అమెజాన్‌తో(Narappa in Amazon Prime) రూ.40కోట్లకు డీల్‌ చేసుకున్నారట. దీనికి శాటిలైట్‌ రైట్స్‌ అదనం.

Above 70 Crore Deal For Narappa, Drishyam 2?
నారప్ప

'దృశ్యం 2' అదే బాటలోనే!

'దృశ్యం2' విడుదలపై స్పష్టత లేనప్పటికీ భారీ మొత్తానికే డీల్‌ కుదిరినట్లు తెలుస్తోంది. సుమారు 35 కోట్లకు 'దృశ్యం2' రీమేక్‌ను(Drishyam 2 Remake) ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డిస్నీ+హాట్​స్టార్​లో స్ట్రీమింగ్​ చేయనున్నారని టాలీవుడ్​లో టాక్​ వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్‌లో విడుదల చేసినా ఈ స్థాయి కలెక్షన్లు ఆశించలేం. దీంతో వెంకీమామ కలెక్షన్ల పరంగా ఓటీటీలోనూ తనదైన సత్తా చాటారని ఆయన అభిమానులు అంటున్నారు. దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి సమాచారం లేదు.

దృశ్యం2

తమిళ సూపర్‌హిట్‌ 'అసురన్‌' రీమేక్‌గా 'నారప్ప', మలయాళ థ్రిల్లర్‌ 'దృశ్యం2' అదే పేరుతో రీమేక్‌ అయింది. మరికొన్ని రోజులు పరిస్థితులు ఇలాగే కొనసాగితే, పెద్ద చిత్రాలు కూడా ఓటీటీలవైపు చూసే అవకాశం ఉంది.

ఇదీ చూడండి.. Kangana: 'తలైవి' విడుదలపై హీరోయిన్​ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.