బిగ్స్క్రీన్పై సినిమా చూసే అనుభూతి కోసం ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వస్తారని అభిప్రాయపడ్డారు నిర్మాత, సినిమా పంపిణీదారుడు అభిషేక్ నామా. సినీ ప్రేమికుల ఓటు ఎప్పుడూ వెండితెరకే ఉంటుందని ఆయన అన్నారు. పంపిణీ రంగంలో 'హ్యారీపోటర్' సినిమాతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన ఈ ఏడాది విడుదలైన 'వరల్డ్ ఫేమస్ లవర్'తో వంద సినిమాల మైలురాయిని అందుకున్నారు. త్వరలోనే నిర్మాతగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమాని పట్టాలెక్కించబోతున్నారు. ఈ సందర్భంగా అభిషేక్ సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.
"కరోనా వల్ల సినిమా పరిశ్రమకి కొన్నాళ్లు విరామం వచ్చిందంతే. అందరూ అనుకుంటున్నట్టుగా మార్పులంటూ ఏమీ రావు. ఓటీటీ వేదికలతో థియేటర్లకి వచ్చిన ముప్పేమీ లేదు. అవి వెండితెరకు ప్రత్యామ్నాయం కాలేవు. ఓటీటీ వేదికల ద్వారా సినిమాల్ని చూస్తారేమో కానీ... నిజమైన అనుభూతిని పొందలేరు" అని అన్నారు అభిషేక్.
ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే సుధీర్‌వర్మ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత తమ సంస్థ నుంచి మూడు కొత్త చిత్రాల్ని ప్రకటిస్తామని చెప్పారు అభిషేక్ నామా.
ఇదీ చూడండి... 'నా టాలెంట్‌తో ఎవరినైనా బోల్తా కొట్టించగలను'