బాలీవుడ్ చిత్రనిర్మాణ సంస్థ ఆర్ఎల్వీపీ మూవీస్ నుంచి కొత్త సినిమా ప్రకటన వెలువడింది. లెజెండరీ హాకీ ప్లేయర్ ధ్యాన్‌చంద్‌పై బయోపిక్‌ను రూపొందించనున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రానికి అభిషేక్ చౌబే దర్శకత్వం వహించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను పట్టాలెక్కించనున్నట్లు పేర్కొంది. 2022లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాణసంస్థ వెల్లడించింది.
-
HOCKEY LEGEND #DHYANCHAND BIOPIC ANNOUNCED... Producer Ronnie Screwvala and director Abhishek Chaubey reunite, after #Sonchiriya... Announce a film on #Hockey legend #DhyanChand... Co-produced by Premnath Rajagopalan... Star cast under finalisation... Starts 2021... 2022 release. pic.twitter.com/E438gIHSdz
— taran adarsh (@taran_adarsh) December 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">HOCKEY LEGEND #DHYANCHAND BIOPIC ANNOUNCED... Producer Ronnie Screwvala and director Abhishek Chaubey reunite, after #Sonchiriya... Announce a film on #Hockey legend #DhyanChand... Co-produced by Premnath Rajagopalan... Star cast under finalisation... Starts 2021... 2022 release. pic.twitter.com/E438gIHSdz
— taran adarsh (@taran_adarsh) December 15, 2020HOCKEY LEGEND #DHYANCHAND BIOPIC ANNOUNCED... Producer Ronnie Screwvala and director Abhishek Chaubey reunite, after #Sonchiriya... Announce a film on #Hockey legend #DhyanChand... Co-produced by Premnath Rajagopalan... Star cast under finalisation... Starts 2021... 2022 release. pic.twitter.com/E438gIHSdz
— taran adarsh (@taran_adarsh) December 15, 2020
లీడ్రోల్లో స్టార్ హీరో!
1500 ప్లస్ గోల్స్, మూడు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ (1928, 1932, 1936 ఒలింపిక్స్‌లలో)తో హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ భారత్‌కు గర్వకారణంగా నిలిచాడు. సుప్రతిక్ సేన్, అభిషేక్ చౌబే సంయుక్తంగా ఈ చిత్రానికి కథను అందించనున్నారు. ధ్యాన్‌చంద్ పాత్ర కోసం ఓ ప్రముఖ నటుడ్ని ఎంచుకోనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
సంతోషంగా ఉంది..
తన తండ్రి బయోపిక్ తెరకెక్కడం పట్ల సంతోషంగా ఉన్నట్లు ధ్యాన్‌చంద్ కుమారుడు.. ఒలింపిక్ పతక విజేత అశోక్ కుమార్ అన్నారు. "మూడుసార్లు ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ధ్యాన్‌చంద్ లాగా ప్రపంచంలో మరో మంచి ఆటగాడు లేడు. నా తండ్రి జీవితంపై సినిమా చేయాలనే కోరికతో రోహిత్ వైద్ (బ్లూ మంకీ ఫిల్మ్స్ క్రియేటివ్ ప్రోడ్యూసర్) నన్ను సంప్రదించినప్పుడు వెంటనే అంగీకరించాను. ధ్యాన్‌చంద్ విజయాలను ప్రపంచమంతా చూస్తాయి. ఇందులో భాగం కావడం నాకెంతో ఆనందంగా ఉంది." అని తెలిపాడు.