ETV Bharat / sitara

కరోనా నుంచి కోలుకున్న అభిషేక్​ - bollywood corona news updates

కరోనాతో ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్​ హీరో అభిషేక్​ బచ్చన్​కు శనివారం నెగిటివ్​ నిర్ధరణ అయ్యింది. దీంతో అభిషేక్​ సంతోషం వ్యక్తం చేస్తూ.. ట్విట్టర్​ వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

abhishek bachan
అభిషేక్​
author img

By

Published : Aug 8, 2020, 3:05 PM IST

ఇటీవలే కరోనా బారినపడ్డ బాలీవుడ్​ హీరో అభిషేక్​ బచ్చన్​ శనివారం కోలుకున్నాడు. మధ్యాహ్నం వైద్యులు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్​గా తేలినట్లు అభిషేక్​ ట్విట్టర్​ వేదికగా తెలిపాడు. ఈ క్రమంలోనే ఈ మహమ్మారిని జయించినందుకు సంతోషం వ్యక్తం చేశాడు.

  • A promise is a promise!
    This afternoon I tested Covid-19 NEGATIVE!!! I told you guys I’d beat this. 💪🏽 thank you all for your prayers for me and my family. My eternal gratitude to the doctors and nursing staff at Nanavati hospital for all that they have done. 🙏🏽 THANK YOU!

    — Abhishek Bachchan (@juniorbachchan) August 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మాటిచ్చిన తర్వాత తప్పను. ఈ రోజు మధ్యాహ్నం పరీక్షల్లో నాకు కరోనా నెగిటివ్​ నిర్ధరణ అయ్యింది. దీన్ని జయిస్తానని మీకు చెప్పాను కదా. మా కుటుంబం కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నానావతి ఆసుపత్రిలోని వైద్యులు, నర్సింగ్​ సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా."

-అభిషేక్​ బచ్చన్​, సినీ నటుడు

బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​తో పాటు అభిషేక్​ బచ్చన్​ జులై 11న కరోనా బారిన పడ్డారు. ఆగస్టు 2న అమితాబ్​ బచ్చన్​ మహమ్మారి నుంచి కోలుకుని.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. అభిషేక్​ భార్య ఐశ్వర్యారాయ్​, కుమార్తె ఆరాధ్య జులై 27న నెగిటివ్​తో బయటపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.