ETV Bharat / sitara

షూటింగ్​లో ఆమిర్​ ఖాన్​కు గాయం.. అయినా సరే! - Aamir Khan injury

కథానాయకుడు ఆమిర్ ఖాన్​కు సినిమా షూటింగ్​లో గాయమైనా సరే చిత్రీకరణ పూర్తిచేశారు. అభిమానులతో మిస్టర్ పర్​ఫెక్ట్ అనిపించుకున్నారు.

Aamir Khan suffers rib injury during action sequence
ఆమిర్​ఖాన్
author img

By

Published : Oct 19, 2020, 4:24 PM IST

Updated : Oct 19, 2020, 4:29 PM IST

బాలీవుడ్ అగ్రహీరో ఆమిర్​ ఖాన్​కు గాయమైనా సరే షూటింగ్​లో పాల్గొన్నారు. పెయిన్ కిల్లర్స్ వేసుకుని మరీ 'లాల్​సింగ్ చద్దా' సినిమాలోని సన్నివేశాలను పూర్తి చేశారు. ఈ విషయాన్ని చిత్రబృందంలోని ఓ వ్యక్తి వెల్లడించారు. ఓ యాక్షన్ సీన్ తీస్తుండగా ఆమిర్ పక్కటెముకకు గాయమైందని, అయినా సరే షూట్ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో తిరిగి చిత్రీకరణలో పాల్గొన్నారని తెలిపారు.

హాలీవుడ్​ హిట్ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్​ అయిన ఈ సినిమాను దర్శకుడు అద్వైత్ చందన్ తెరకెక్కిస్తున్నారు. కరీనా కపూర్ హీరోయిన్. త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్న కారణంగా ఆమెకు సంబంధించిన షూటింగ్​ను ఇటీవలే పూర్తి చేశారు. ఆ విషయాన్ని ఇన్​స్టా వేదికగా కరీనా పంచుకుంది.

Last Updated : Oct 19, 2020, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.