ETV Bharat / sitara

కరీనా కపూర్​కు ఇష్టమైన ఆమిర్​ఖాన్ తలగడ - కరీనా కపూర్​ న్యూస్​

బాలీవుడ్​ విలక్షణ నటుడు ఆమిర్​ఖాన్​ పుట్టినరోజు సందర్భంగా అతడికి శుభాకాంక్షలు చెప్పింది కరీనా కపూర్​. దిండును పట్టుకుని అతడు నిద్రపోతున్న ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్ చేసి విష్ చేసింది.

Aamir Khan Gets A Typically Kareena Kapoor Birthday Wish
నాకిష్టమైన సహనటుడు అతడే..!
author img

By

Published : Mar 15, 2020, 7:37 AM IST

బాలీవుడ్‌ హీరోయిన్ కరీనా కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సహనటుడు ఆమిర్‌ ఖాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరచిన కరీనా.. ఆమిర్‌ విమానంలో దిండుని పట్టుకుని నిద్రపోతున్నప్పుడు తీసుకున్న ఫొటోను శనివారం పోస్ట్‌ చేసింది. 'నాకు ఇష్టమైన సహ నటుడు ఆమిర్‌ ఖాన్‌... దిండు!' అంటూ క్యాప్షన్‌ పెట్టింది.

కరీనా, ఆమిర్‌ ప్రధాన పాత్రల్లో 'లాల్‌ సింగ్‌ చద్దా' సినిమా తీస్తున్నారు. చిత్రీకరణ కోసం తాజాగా వీరిద్దరు ముంబయిలో కలుసుకున్నారు. ఆ ప్రయాణంలో ఆమిర్​ దిండు పట్టుకుని నిద్రపోతుండగా.. 'చూడండి... ఆమిర్‌ విమానంలోనూ దిండు లేకుండా ప్రయాణం చేయలేరేమో?' అన్నట్లు కరీనా సెల్ఫీ తీసి అభిమానులతో పంచుకుంది. వీరిద్దరూ కలిసి 2009లో వచ్చిన 'త్రీ ఇడియట్స్‌', 2012లో వచ్చిన 'తలాష్‌'లలో నటించారు.

మళ్లీ ఇన్నేళ్లకు 'లాల్‌ సింగ్‌ చద్దా'తో వెండితెరపై కనువిందు చేయనున్నారు. ఆమిర్‌తో 'తారే జమీన్‌ పర్‌', 'సీక్రెట్‌ సూపర్‌స్టార్‌' సినిమాలను తీసిన అద్వైత్‌ చందన్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చూడండి.. పాఠశాల నుంచి పంపేస్తారనే భయంతో ఆమిర్ ఉండేవాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.