Aadavallu meeku joharlu movie: శర్వానంద్-రష్మిక జంటగా నటించిన సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం.. మార్చి 4న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 27న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ డైరెక్టర్ సుకుమార్, హీరోయిన్లు కీర్తి సురేశ్, సాయిపల్లవి రానున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం ప్రకటించడం సహా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.
కరోనా తొలి లాక్డౌన్ నేపథ్యంగా ఓ ఆంథాలజీ సినిమా తీసేందుకు బాలీవుడ్లో రంగం సిద్ధమైంది. దీనిని ప్రముఖ దర్శకులు సుధీర్ మిశ్రా, అనుభవ్ సిన్హా, హన్సల్ మెహతా కలిసి తెరకెక్కించనున్నారు. ఇందులో భాగంగా తొలి భాగానికి అనుభవ్ డైరెక్టర్‌గా చేయనున్నారు. ఇందులో ప్రధాన పాత్ర కోసం తాప్సీని ఎంపిక చేశారు. వీరిద్దరూ గతంలో 'తప్పడ్', 'ముల్క్' సినిమాల కోసం కలిసి పనిచేశారు.
Pa Ranjith hindi movie: ఇటీవల కాలంలో దక్షిణాది దర్శకులు.. బాలీవుడ్లో నేరుగా సినిమాలు చేస్తున్నారు. వీరిలో చాలామంది తెలుగు దర్శకులు ఉన్నాయి. ఇప్పుడీ జాబితాలోకి తమిళ డైరెక్టర్ పా.రంజిత్ చేరారు.
రంజిత్ నేరుగా దర్శకత్వం వహిస్తున్న తొలి హిందీ సినిమాకు 'బిర్సా' టైటిల్ ఖరారు చేశారు. షెరిన్ మంత్రి-కిశోర్ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ.. కొత్త సినిమా కోసం ప్రిపరేషన్స్ మొదలుపెట్టేసింది. 'చక్‌దే ఎక్స్‌ప్రెస్' టైటిల్‌తో తీస్తున్న ఈ సినిమా.. ప్రముఖ మహిళ బౌలర్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. అనుష్క, జులన్ పాత్రలో నటిస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇందులో భాగంగా బౌలింగ్ ప్రాక్టీసు చేస్తున్న రెండు ఫొటోలను అనుష్క, ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. 2017లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న అనుష్క.. ఆ తర్వాత కొన్నాళ్లు నటనకు విరామం ప్రకటించింది. కానీ నిర్మాతగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసింది.
ఇవీ చదవండి: