ETV Bharat / sitara

బన్నీకి మరోసారి విజయ్ గిఫ్ట్​.. ఈసారి ఏంటంటే?

author img

By

Published : Sep 6, 2020, 2:22 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్​కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి సర్​ప్రైజ్ చేశారు. అతడి సొంత బ్రాండ్​ 'రౌడీ వేర్' దుస్తులను బన్నీకి కానుకగా పంపించారు.

Vijay Devarakonda
విజయ్ దేవరకొండ

స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్​, హీరో విజయ్​ దేవరకొండ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో తన రౌడీ బ్రాండ్​ దుస్తులను బహుమతిగా పంపి బన్నీని సర్​ప్రైజ్ చేశారు విజయ్​. ఇప్పుడు మరోసారి అలానే గిఫ్ట్​ ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు. రౌడీ హీరోకు కృతజ్ఞతలు చెబుతూ తన ఇన్​స్టా స్టోరీస్​లో ఆ ఫొటోను పోస్ట్ చేశారు బన్నీ. ఈ బహుమతిలో రౌడీవేర్ టీషర్ట్, ట్రాక్, డిజైనర్ మాస్క్​లు ఉన్నాయి.

A Surprise Gift From Vijay Devarakonda To Allu Arjun
రౌడీహీరో మరోసారి సర్​ప్రైజ్​

స్టార్ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో 'ఫైటర్‌'(వర్కింగ్‌ టైటిల్‌)లో నటిస్తున్నారు విజయ్ దేవరకొండ. అనన్య పాండే హీరోయిన్. పాన్‌ ఇండియా కథతో తెరకెక్కిస్తున్నారు. దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు బన్నీ, సుకుమార్​ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ వల్ల‌ ఈ సినిమాల షూటింగ్​లు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి.

ఇదీ చూడండి బాలయ్య-బోయపాటి సినిమాలో మీనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.