ETV Bharat / sitara

హృతిక్​ రోషన్​కు విలన్​గా దక్షిణాది నటుడు! - హృతిక్​ రోషన్​ న్యూస్​

బాలీవుడ్​ స్టార్​ హీరో హృతిక్​ రోషన్​.. అతని తండ్రి రాకేశ్​ రోషన్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'క్రిష్​' సిరీస్​ చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. వీరిద్దరి కాంబినేషన్​లో 'క్రిష్​ 4' రూపొందనుందని సమాచారం. ఈ చిత్రంలో దక్షిణాది నటుడిని ప్రతినాయకుడిగా ఎంపిక చేసినట్లు బాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

A South indian actor will be lead negative role in 'Krrish 4' Movie!
హృతిక్​ రోషన్​ విలన్​గా దక్షిణాధి నటుడు!
author img

By

Published : Apr 16, 2020, 3:29 PM IST

బాలీవుడ్‌లో డ్యాన్స్‌లతో పాటు యాక్షన్‌ సన్నివేశాల్లోనూ అదరగొట్టే కథానాయకుల్లో హృతిక్‌ రోషన్‌ ఒకరు. అతడు ప్రేమకథలతో పాటు, సూపర్‌ హీరోలాంటి యాక్షన్‌ చిత్రాల్లోను నటించి మెప్పించాడు. ఇప్పటివరకు హృతిక్‌ 'క్రిష్‌' సీక్వెల్‌ చిత్రాల్లో నటించి అలరించాడు. ప్రస్తుతం 'క్రిష్‌ 4' సినిమాకు దర్శకుడు రాకేష్‌ రోషన్‌ స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో ఉన్నారట. త్వరలోనే చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు కసరత్తులు చేస్తుందట చిత్రబృందం. ఇదే విషయాన్ని హృతిక్‌ తండ్రి దర్శకుడు రాకేష్‌ రోషన్‌ ఓ సమయంలో స్వయంగా చెప్పారు.

అయితే ఇందులో ప్రతినాయకుడి పాత్రలో ఎవర్ని తీసుకోవాలనే అంశంపై చర్చలు జరిగాయట. అంతేకాదు 'క్రిష్‌ 4' చిత్రంలో విలన్ పాత్రకు దక్షిణాదికి చెందిన కథానాయకుడిని తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తుందట. పలువురు బాలీవుడ్​ తారలు ఇప్పటికే తెలుగు, తమిళంలో వచ్చే చిత్రాల్లో కొన్ని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

A South indian actor will be lead negative role in 'Krrish 4' Movie!
'క్రిష్​' సినిమాలో హృతిక్​ రోషన్​

ప్రస్తుతం బాలీవుడ్, దక్షిణాది చిత్రసీమలు కొత్తగా తెరకెక్కించే సినిమాలను పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అందుకే వివిధ ప్రాంతాలకు చెందిన నాయికానాయకులతో పాటు ఇతర భాషా నటీనటులనూ తమ చిత్రాల్లో నటింపజేస్తున్నారు.

ఇదీ చూడండి.. లాక్​డౌన్​ అతిక్రమించే 'జోకర్ల'కు సల్మాన్​ విజ్ఞప్తి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.