తన అందంతో కుర్రకారు మతిపోగొడుతూ వాళ్లకి నిద్రలేకుండా చేస్తుంది సన్నీ లియోని. ప్రత్యేక గీతాల్లో కనిపించి యువతను ఆకట్టుకుంటోంది. తాజాగా 'రాగిణి ఎమ్.ఎమ్.ఎస్ రిటర్న్స్ సీజన్ -2' చిత్రంలో 'హలో జీ' అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సాంగ్‌ని హిందీ గాయని కనికా కపూర్ ఆలపించింది. విడుదలైన కొన్ని గంటల్లోనే నెట్టింట వైరల్ అవుతోందీ గీతం. ఈ సినిమాలో సన్నీ దెయ్యం పాత్రలో నటిస్తోంది. తెలుగు నటుడు నవదీప్ ఇందులో కీలక పాత్ర పోషించనున్నాడు.
'జిస్మ్ 2' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది సన్నీ లియోని. 'రాగిణి ఎమ్ ఎమ్ ఎస్' ద్వారా తనలో గొప్ప నటి, డ్యాన్సర్ ఉందని నిరూపించుకుంది. 'రాగిణి' ఘన విజయం సాధించిన తర్వాత ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. అప్పటి నుంచి ఆమె ఎన్నో ప్రత్యేక గీతాల్లో కనిపించి యువతని ఆకట్టుకుంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి.. 'క్షీరసాగర మథనం' విలన్‌ను పరిచయం చేసిన అడవి శేషు