సీనియర్ హీరో రాజశేఖర్ కారుకు ప్రమాదం జరిగింది. శంషాబాద్ పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్‌పై ఆయన వాహనం బోల్తా కొట్టింది. అనంతరం మూడు పల్టీలు కొట్టినట్టు తెలుస్తోంది. అదే సమయానికి ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడం వల్ల స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
హైదరాబాద్ నుండి విజయవాడకు వెళుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
2017లో 'గరుడవేగ' చిత్ర విడుదలకు ముందు రాజశేఖర్ ఇదే విధంగా ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్లోని పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై మరో వ్యక్తి కారును తన వాహనంతో ఢీకొట్టారు.