తనను(sanjjanaa galrani news) ఓలా క్యాబ్ డ్రైవరు అపహరించాడని ఆరోపణలు చేసిన నటి సంజనా గల్రానిపై బాధిత డ్రైవరు సుసైయ్ రాజరాజేశ్వరినగర పోలీసు ఠాణాలో బుధవారం ఫిర్యాదు చేయడం వల్ల కథ మలుపు తిరిగింది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. ఆ వివరాల్లోకి ఓ సారి తొంగిచూస్తే.. ఇందిరానగర నుంచి కెంగేరి వెళ్లేందుకు సంజన మంగళవారం రాత్రి క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఏసీ వేయాలని డ్రైవరుకు ఆమె సూచించారు. చోదకుడు ఏసీ వేసేలోగా సంజన తిట్ల పురాణాన్ని మొదలుపెట్టారు. అక్కడికక్కడ తనను క్యాబ్ డ్రైవరు అపహరించాడని ఒక సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారు. తనను ఎక్కడకు తీసుకు వెళుతున్నావంటూ డ్రైవరును బెదిరించింది. మీరు బుక్ చేసిన లొకేషన్‌కే వెళుతున్నామని చెప్పినా వినకుండా ఆమె తిట్ల వర్షం కురిపించింది. గమ్యస్థానం వచ్చిన అనంతరం నా భర్త వస్తాడని, నీ అంతు చూస్తాడని బెదిరించింది. ఆమె ఎందుకు అలా మాట్లాడుతుందో అర్థం కాని సుసైయ్.. మౌనాన్ని ఆశ్రయించాడు. అంతటితో ఆగకుండా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి కారు డ్రైవరుపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మొత్తాన్ని డ్రైవరు తన చరవాణిలో రికార్డు చేసి.. పోలీసులకు వివరించారు. అతని ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ట్వీట్ చేసిన సంజన(sanjjanaa galrani news)
క్యాబ్ డ్రైవరు చిన్న విషయాన్ని వివాదంగా మార్చివేశాడని సంజన గల్రాని ట్వీట్ చేశారు. ఏసీ వేయాలని కోరితే.. కొవిడ్ నిబంధనల ప్రకారం వేయకూడదని చెప్పకుండా.. మొరటుగా సమాధానం ఇచ్చాడని తప్పుపట్టింది. చిత్రీకరణకు వెళ్లవలసిన స్థలానికి కాకుండా మరో మార్గంలో తీసుకు వెళ్లాడని ఆరోపించింది. వేరే దారిలో తీసుకు వెళ్లినందుకు మీటరుపై రెట్టింపు ఇవ్వాలని కోరడం వల్ల తాను రూ.10 వేలు ఇవ్వడం సాధ్యమా? మీ అక్క, చెల్లెళ్లను ఇలానే అడుగుతావా? అని ప్రశ్నించడమే తప్పయిందని చెప్పారు. మొదట పోలీసులకు ఫిర్యాదు చేసిన తాను.. అనంతరం మరోసారి పోలీసులకు ఫోన్ చేసి, డ్రైవరుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోరానని తెలిపింది. డ్రైవర్లు, కార్మికులను గౌరవంగా చూస్తానని, అతను తనతో అమర్యాదగా ప్రవర్తించినా క్షమించానని ఆమె ట్వీట్ చేసింది. ప్రతి ఒక్కరూ మహిళలతో గౌరవంగా వ్యవహరించాలని కోరుకుంటానని వరుస ట్వీట్లను మోతెక్కించింది.
ఇదీ చూడండి: 'కొండపొలం' సాంగ్.. కొత్త సినిమాతో ఆది