అశ్లీల చిత్రాల దందా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా, రియాన్ థోర్పేకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది ముంబయి కోర్టు. ఈ విషయాన్ని కుంద్రా తరఫు న్యాయవాది తెలిపారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు.
అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో ముంబయి పోలీసులు ఈ నెల 19వ తేదీన రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేశారు. అశ్లీల చిత్రాలను నిర్మించి పలు యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారని తెలిసి గత ఫిబ్రవరిలో ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి దీనిపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు సాక్ష్యాలను సేకరించి ఇటీవల కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు. విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల నటి షెర్లిన్ చోప్రాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఇవీ చూడండి: సింగపూర్ నుంచి రాజ్‌కుంద్రా ఖాతాలకు భారీగా నగదు బదిలీ!
'మరదల్ని లీడ్‌గా పెట్టి.. కొత్త యాప్ ప్రారంభించాలనుకుంటే..'