సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఇచ్చే అకాడమీ అవార్డు 'ఆస్కార్'. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది కూడా అలాంటి ప్రణాళికలే సిద్దం చేస్తోంది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్. అయితే 2019 వరకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఒక ప్రముఖ నటుడిని హోస్ట్‌గా నియమించేవారు. కానీ 2019లో ఈ విధానానికి స్వస్తి పలికి మొదటిసారి అకాడమీ వేడుకలో హోస్ట్ లేకుండానే ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఏడాదీ అదే పద్ధతిని కొనసాగిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపింది అకాడమీ.
-
Monday: Oscar nominations announced @theacademy #OscarNoms (13 Jan)
— AP Planner (@AP_Planner) January 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Monday: Oscar nominations announced @theacademy #OscarNoms (13 Jan)
— AP Planner (@AP_Planner) January 10, 2020Monday: Oscar nominations announced @theacademy #OscarNoms (13 Jan)
— AP Planner (@AP_Planner) January 10, 2020
ఈ సారి జరిగే 92వ అకాడమీ వేడుకలో ప్రపంచ అగ్రశేణి తారలు, అందరిని ఆకట్టుకునే అద్భుతమైన ప్రదర్శనలు, చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయని... కానీ హోస్ట్ మాత్రం ఉండడని తెలిపింది. ఈ సోమవారం 2020 ఆస్కార్ బరిలో ఉన్న పోటీదారుల జాబితాను విడుదల చేయనున్నారు నిర్వాహకులు. ఫిబ్రవరి 9న ఈ కార్యక్రమం అమెరికాలో జరగనుంది. ఈ వేడుకను వీక్షించటానికి ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2018లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యకమానికి 928 మందిని ఆహ్వానించింది. భారత్ నుంచి షారుఖ్ , మాధురీ దీక్షిత్, నషారుద్దీన్ షా వంటి ప్రముఖులు ఉన్నారు.
842 మందితో..
గతేడాది ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ఎంపిక కమిటీ కొత్త సభ్యులుగా వివిధ దేశాలకు చెందిన సినీ ప్రముఖుల్ని ఆహ్వానించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. భారతదేశం నుంచి దర్శకులు జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్‌తో పాటు నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 842 మంది కొత్త వారికి ఈ అవకాశం దక్కింది. ఇందులో సగానికి పైగా మహిళలున్నారు. వీరితో పాటే 21 మంది ఆస్కార్ విజేతలు, 82 మంది ఆస్కార్ నామినేషన్ పొందిన వారు ఈ జాబితాలో ఉండటం విశేషం.
వీరితో పాటే దర్శక-రచయిత రితేశ్ బత్రా, దర్శకుడు నిషా గనత్రా, భారత మూలాలున్న బ్రిటీష్ నటి ఆర్చి పంజాబీ, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో షెర్రీ భద్ర, శ్రీనివాస్ మోహన్.. ఆస్కార్ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు.