ETV Bharat / sitara

Cinema news: '83' టీజర్.. ఓటీటీలో మూడు తెలుగు సినిమాలు - 83 మూవీ టీజర్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో '83' సినిమా టీజర్​తో పాటు మూడు తెలుగు చిత్రాల ఓటీటీ రిలీజ్​ గురించి ఉంది.

cinema news
సినిమా న్యూస్
author img

By

Published : Nov 26, 2021, 11:14 AM IST

*1983 ప్రపంచకప్​ ఆధారంగా తీస్తున్న సినిమా '83'. గత కొన్ని నెలల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం.. డిసెంబరు 24న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే టీజర్​ను శుక్రవారం(నవంబరు 26) రిలీజ్ చేశారు. 1983 జూన్ 25న జరిగిన మ్యాచ్​ దృశ్యాల్ని.. ఈ టీజర్​లో కళ్లకు కట్టినట్లు చూపించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాలో కపిల్​దేవ్​ పాత్రలో రణ్​వీర్ సింగ్, కపిల్​ భార్య పాత్రలో దీపికా పదుకొణె నటించింది. మిగతా పాత్రల్లో జీవా, పంకజ్ త్రిపాఠి, అమ్మి విర్క్, తాహిర్ బాసిన్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

*ఓటీటీలో శుక్రవారం మూడు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఆకాశ్ పూరీ 'రొమాంటిక్', సాయిధరమ్ తేజ్ 'రిపబ్లిక్', నవీన్ చంద్ర 'బ్రో' చిత్రాలు ఉన్నాయి.

romantic OTT
రొమాంటిక్ మూవీ ఓటీటీ

'రొమాంటిక్' సినిమాలో ఆకాశ్ పూరీ, కేతిక శర్మ హీరోహీరోయిన్లుగా నటించారు. ఆహా ఓటీటీలో ఇది విడుదలైంది. పూరీ జగన్నాథ్.. కథ, స్క్రీన్​ప్లే, మాటలు అందించగా.. అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు.

'రిపబ్లిక్' సినిమా జీ5లో రిలీజైంది. ఇందులో సాయిధరమ్ తేజ్.. కలెక్టర్​గా నటించారు. దేవాకట్టా దర్శకత్వం వహించారు.

republic OTT
రిపబ్లిక్ మూవీ ఓటీటీ

'బ్రో' సినిమాలో నవీన్ చంద్ర, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నాచెల్లెలు నేపథ్యంగా తీసిన ఈ చిత్రాన్ని నేరుగా సోనీ లివ్​లో విడుదల చేశారు. కార్తిక్ తుపరాని దర్శకత్వం వహించారు.

bro movie OTT
బ్రో మూవీ ఓటీటీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.