ETV Bharat / sitara

అట్టహాసంగా మొదలైన 'కేన్స్​' ​ సినీ సంబరం

ప్రతిష్ఠాత్మక 74వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఫ్రాన్స్​లోని కేన్స్​లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆరంభ చిత్రంగా లియోస్​ కారక్స్​ తెరకెక్కించిన 'అన్నెట్టే' చిత్రాన్ని ప్రదర్శించారు. ఎర్రతివాచీపై నడుస్తూ పలువురు హాలీవుడ్​ తారలు సందడి చేశారు.

cannes film festival
కేన్స్​ చిత్రోత్సవం
author img

By

Published : Jul 7, 2021, 2:55 AM IST

Updated : Jul 7, 2021, 6:46 AM IST

గతేడాది కరోనా కారణంగా రద్దైన ప్రపంచ ప్రఖ్యాత 'కేన్స్ అంతర్జాతీయ​ చలన చిత్రోత్సవం' ఈసారి మళ్లీ వచ్చేసింది. ఫ్రాన్స్​లోని కేన్స్​ నగరం వేదికగా.. మంగళవారం ఈ సినిమా సంబరం ఘనంగా ప్రారంభమైంది. 74వ ఏడాది జరుగుతున్న ఈ చిత్రోత్సవంలో లియోస్​ కారక్స్​ దర్శకత్వం వహించిన 'అన్నెట్టే' చిత్రాన్ని తొలుత ప్రదర్శించారు.

చిత్రోత్సవంలో భాగంగా.. మొదటి రోజు ఎర్ర తివాచీపై పలువురు హాలీవుడ్​ తారలు నడుస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. వచ్చే శనివారం(జులై 17) వరకు ఈ సినీ సంబరం కొనసాగనుంది.

కరోనా ఆంక్షల మధ్యే..

చిత్రోత్సవంలో కరోనా నిబంధలను పక్కాగా అమలు చేస్తున్నారు. కొవిడ్​ టీకా తీసుకున్నావారిని లేదా 48 గంటల ముందు కరోనా పరీక్షల్లో నెగెటివ్​ వచ్చిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. నటీనటులు ముద్దు పెట్టుకోవడాన్ని నిషేధించారు.

Last Updated : Jul 7, 2021, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.