తన సంగీత ప్రయాణంలో స్ఫూర్తిగా నిలిచిన సంగీత దర్శకులు, దర్శకులకు '99 సాంగ్స్' చిత్రాన్ని అంకితమిస్తున్నట్లు సినిమా నిర్మాత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తెలిపారు. ఈ చిత్రంతో రచయితగా, నిర్మాతగా మారిన రెహమాన్.. ఇన్నాళ్లు ఆరు పాటలతోనే సాగిన తన ప్రయాణంలో 2001లో జరిగిన సంఘటన వల్ల కొత్త మలుపు తీసుకోవాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు.
28 ఏళ్లుగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు చక్కటి ప్రేమకథతో '99 సాంగ్స్' చిత్రాన్ని నిర్మించినట్లు రెహమాన్ వెల్లడించారు. విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 16న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్ వచ్చిన రెహమాన్.. చిత్ర కథానాయకుడు ఇహాన్ భట్, సంగీత దర్శకుడు కోటితో కలిసి తెలుగు పాటలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా తన కథకు కథానాయకుడు దొరకడానికి 700 మంది కుర్రాళ్లకు ఆడిషన్స్ నిర్వహించామని.. చివరగా కశ్మీర్ నుంచి వచ్చిన ఇహాన్ను ఎంపిక చేసుకున్నట్లు స్పష్టం చేశారు రెహమాన్. త్వరలోనే తెలుగులో మంచి సినిమా చేస్తానని వెల్లడించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'మనసు భారంగా ఉన్నప్పుడు '99సాంగ్స్' వినండి'