ETV Bharat / sitara

ఈ​ బాలీవుడ్ సెలబ్రిటీలకు నటనే కాదు చాలా వచ్చు

author img

By

Published : Mar 14, 2020, 1:56 PM IST

సినిమాలనే కెరీర్​గా ఎంచుకున్న ఈ సెలబ్రిటీలు.. వివిధ రంగాల్లోనూ రాణిస్తూ మెప్పిస్తున్నారు. వారిలో ప్రీతి జింతా, మలైకా అరోరా, అభిషేక్ బచ్చన్ తదితరులు ఉన్నారు.

ఈ​ బాలీవుడ్ సెలబ్రిటీలకు నటనే కాదు చాలా వచ్చు
బాలీవుడ్ వార్తలు

బాలీవుడ్​లోని పలువురు ప్రముఖ నటీనటులు సినిమాలు చేస్తూ బిజీగానే జీవితాన్ని గడుపుతున్నారు. అయితే వారిలో చాలామంది నటనలోనే కాకుండా వివిధ వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు. ఆయా రంగాల్లో సక్సెస్ అయ్యారు. ఇంతకీ వారెవరు? ఏం చేశారు? తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.

1. అభిషేక్ బచ్చన్

అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్.. చివరగా 2018లో 'మన్మర్జియాన్'లో కనిపించాడు. ఇతడు నటుడిగా కంటే బిజినెస్​మ్యాన్​గానే విజయవంతమయ్యాడు. ప్రస్తుతం ప్రో కబడ్డీలో పింక్ పాంథర్స్, ఐఎస్​ఎల్​లో చెన్నైయన్ ఎఫ్​సీ జట్లకు యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఫుట్​బాల్​ లీగ్​లో చెన్నై జట్టు ఇప్పటికే రెండుసార్లు టైటిల్​ గెలుచుకోవడం విశేషం.

abhisekh bachan
హీరో అభిషేక్ బచ్చన్

ఇదే కాకుండా ఎల్​జీ, అమెరికన్ ఎక్స్​ప్రెస్ క్రెడిట్ కార్డ్, వీడియోకాన్, మోటరోలా బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నాడు. ప్రస్తుతం ఇతడి సంపాదన 30 మిలియన్ డాలర్లు.

2. సునీల్ శెట్టి

58 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే లుక్స్​తో ఆకట్టుకుంటున్నాడు బాలీవుడ్ నటుడు సునీల్​శెట్టి. హిందీలోనే కాకుండా దక్షిణాదిలోని పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. చివరగా రజనీ 'దర్బార్​'లో విలన్​గా కనిపించాడు.

sunil shetty
నటుడు సునీల్ శెట్టి

సునీల్​శెట్టికి పాప్​కార్న్ మోషన్​ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఎఫ్​టీసీ అనే ఆన్​లైన్ ఫ్లాట్​ఫామ్​ను నడిపిస్తూ, ప్రతిభావంతులకు ఇందులో అవకాశాలిస్తున్నాడు. 'ఫిట్టర్' అనే ఫిట్​నెస్​ అంకుర సంస్థలోనూ నిధులు పెట్టాడు. హెచ్​20 లిక్విడ్​ లాంజ్ అనే రెస్టారెంట్ ఇతడికి ఉంది. ఇదే కాకుండా సెలబ్రిటీ క్రికెట్ లీగ్​లో ముంబయి హీరోస్ జట్టుకు సునీల్ యజమాని.

3. ట్వింకిల్ ఖన్నా

'కాఫీ విత్ కరణ్' టాక్​షోలో ఓ ఎపిసోడ్​కు వచ్చిన ట్వింకిల్​ ఖన్నా.. తాను అంత మంచి నటిని కానని చెప్పింది. మళ్లీ సినిమాల్లో నటించనంది. అయితే ఈమెలో స్వతహాగా ఓ రచయిత్రి ఉంది. 'టైమ్స్ ఆఫ్ ఇండియా'లో అప్పుడప్పుడు ఓ కాలమ్​ను రాస్తుంటుంది. మిసెస్ ఫన్నీ బోన్స్, పైజామాస్ ఆర్ ఫర్​గివింగ్, ద లెజెండ్ ఆఫ్ లక్ష్మి ప్రసాద్ అనే పుస్తకాలను రాసింది.

twinkle khanna
నటి, రచయిత్రి ట్వింకిల్ ఖన్నా

ఇటీవలే ట్వీక్ మీడియా అనే డిజిటల్ కంపెనీని ప్రారంభించింది. 2016లో మిసెస్ ఫన్నీ బోన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. అందులో తన భర్తను హీరోగా పెట్టి 'ప్యాడ్​మ్యాన్' సినిమా తీసింది. జాతీయ అవార్డునూ గెల్చుకుందీ చిత్రం. ఆమె రెండు ఇంటీరియర్ డిజైన్​ స్టోర్స్​ను నడుపుతోంది.

4. మలైకా అరోరా

బాలీవుడ్ నటి మలైకా అరోరా.. ఎక్కువగా సినిమాలు చేయకపోవచ్చు. కానీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఫిట్​నెస్​పై ఎక్కువగా దృష్టిసారించే ఈ ముద్దుగుమ్మ.. సోషల్​ మీడియాలో ఎప్పటికప్పుడూ అందుకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తుంది. 'లేబుల్ లైఫ్' పేరుతో ఈ-కామర్స్ సైట్​ను నడుపుతోంది. సుసేన్ ఖాన్-బిపాసా బసు ఇందులో భాగస్వామ్యులు.

Malaika Arora
నటి మలైకా అరోరా

5. ప్రీతి జింతా

ఈమెను మీరు గత కొన్నేళ్లలో వెండితెరపై కంటే క్రికెట్ మైదానంలో ఎక్కువ చూసుంటారు. ఎందుకంటే ఐపీఎల్​లో పంజాబ్ జట్టుకు ఓ యజమాని ప్రీతినే. దక్షిణాఫ్రికా టీ20లీగ్​లోనూ స్టెల్లన్ బోష్ కింగ్స్ అనే జట్టును కొనుగోలు చేసింది. 2004లో బీబీసీలో కాలమ్​లను రాసింది.

తన 34వ పుట్టినరోజున 34 మంది అనాథల్ని దత్తత తీసుకుని, వారికి సంబంధించిన ఆర్థిక బాధ్యతల్ని తనే చూసుకుంటోంది. దీనితో పాటే పీజెడ్ఎన్​జెడ్ మీడియా అనే నిర్మాణ సంస్థను నడిపిస్తోంది.

preethy zintha
నటి ప్రీతి జింతా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.