గోవా వేదికగా 50వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వచ్చే నెల 20 నుంచి 28 వరకు జరగనుంది. వివిధ దేశాలకు చెందిన సుమారు 200 సినిమాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమాన్ని భారత్తో పాటు రష్యా సంయుక్తంగా నిర్వహించనుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ చెప్పారు.
26 ఫీచర్, 15 నాన్-ఫీచర్ సినిమాలతో పాటు పలు ప్రాంతీయ భాష చిత్రాలను ప్రదర్శించనున్నారని ప్రకాశ్ జావడేకర్ అన్నారు. వీటితే పాటు వివిధ భాషల్లో 50 ఏళ్ల క్రితం తెరకెక్కిన 12 సినిమాలను ఈ కార్యక్రమంలో వీక్షకులకు చూపించనున్నారు.
ఇటీవలే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న అమితాబ్ బచ్చన్ నటించిన 7-8 సినిమాలను ప్రదర్శించనున్నారు. ఈ చిత్రోత్సవానికి పలువురు ప్రముఖ నటీనటులతో పాటు 10 వేల మందికిపైగా సినీ ప్రేమికులు హాజరు కానున్నారు.
ఇవీ చదవండి: