ETV Bharat / sitara

తొలిసారి ఆ నలుగురితో షారుక్! - అట్లీ

షారుక్​ ఖాన్​ను స్క్రీన్​పై చూసి మూడేళ్లు దాటింది. ఆయన​ను తెరపై ఎప్పుడు చూస్తామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఒక్కటి కాదు ఏకంగా నాలుగు చిత్రాలతో వస్తున్నాడు మన బాలీవుడ్ బాద్​షా. అదీ అతను ఇదివరకు కలిసి పనిచేయని దర్శకులతో రానున్నాడు.

4 Directors Shah Rukh Khan is set to work with next!
తొలిసారి ఆ నలుగురితో షారుక్!
author img

By

Published : Jan 25, 2021, 5:32 AM IST

సుదీర్ఘ విరామం తర్వాత ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు బాలీవుడ్ సూపర్​స్టార్ షారుక్​ ఖాన్. 'జీరో' చిత్రం తర్వాత మరో సినిమా చేయని ఇతడు ఇప్పుడు నాలుగు సినిమాలతో రానున్నట్టు తెలుస్తోంది. అది కూడా సరికొత్త కాంబోలో.. ఇంతకు ముందు కలిసి పనిచేయని దర్శకులతో చేయనున్నాడు షారుక్.

సిద్ధార్థ్ ఆనంద్:

ప్రస్తుతం షారుక్​.. 'పఠాన్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. ఆయన ఇదివరకు హృతిక్​తో 'వార్', 'బ్యాంగ్​ బ్యాంగ్'​ చిత్రాలు చేశాడు. యాక్షన్​ సినిమాలను స్టైలిష్​గా తెరకెక్కించే ఈ దర్శకుడితో చేస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి.

రాజు హిరాణీ:

బాలీవుడ్​లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కలయిక రాజు హిరాణీ-షారుక్. 'పఠాన్' పూర్తవగానే జూన్​లో ఈ సినిమా షూటింగ్​లో పాల్గొంటాడు కింగ్ ఖాన్.

అట్లీ:

తమిళ దర్శకుడు అట్లీతో షారుక్​ సినిమా అంటూ గతంలో ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత ఎలాంటి అప్​డేట్​ లేదు. ఈ ప్రాజెక్ట్​పై అధికారిక ప్రకటన లేనప్పటికీ చిత్రానికి షారుక్​ అంగీకారం చెప్పినట్లు సమాచారం. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్​ పైకి వెళ్లే అవకాశం ఉంది.

రాజ్​, డీకే:

'ఫ్యామిలీ మ్యాన్​' వెబ్​ సిరీస్​ విజయం తర్వాత షాహిద్​తో ఓ వెబ్​సిరీస్​ చేస్తున్నారు దర్శక ద్వయం రాజ్, డీకే. వారితో కలిసి పనిచేయడానికి షారుక్ ఎంతో ఆసక్తితో ఉన్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఉంది. ఇదీ కూడా వచ్చే ఏడాదే చిత్రీకరణకు వెళ్లనుందని సమాచారం.

ఇదీ చూడండి: ఇలియానా: జీరో సైజు సుందరి.. గోవా చిన్నది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.