త్రీడీ సినిమాలు ప్రస్తుతం ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కానీ తొలి 3డీ చిత్రం 96 ఏళ్ల క్రితమే వచ్చింది. 'ద పవర్ ఆఫ్ లవ్' పేరుతో 1922 సెప్టెంబరు 22న విడుదలైంది. మూకీ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీని చూడటానికి రెండు కళ్లద్దాలను వాడారు. ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో వేర్వేరు అద్దాలు ఉండే కళ్లజోడును ఈ సినిమా చూడటానికి ఉపయోగించారు.
ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ చిత్రానికి రెండు ముగింపులిచ్చాడు దర్శకుడు. ఒకటి సుఖాంతం కాగా, మరొకటి విషాదాంతం. కళ్లజోడు పెట్టుకున్న ప్రేక్షకుడు ముగింపు సన్నివేశాల్ని ఓ కంటితో చూస్తే హ్యాపీ ఎండింగ్ కనిపిస్తుంది. మరో కంటితో చూస్తే ట్రాజిక్ ఎండింగ్ను వీక్షించేలా సాంకేతికతను ఉపయోగించారు.
అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. అందుకే ఈ చిత్రాన్ని మళ్లీ టూడీలో విడుదల చేశారు. 'ద ఫర్బిడిన్ లవర్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.