టాలీవుడ్లో హీరోగానే కాకుండా విలన్, సహాయ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్న నటుడు నవీన్ చంద్ర. అతడు హీరోగా నటించిన '28 డిగ్రీస్ సెల్సియస్' టీజర్ విడుదలైంది.
హీరో బతకాలంటే 28 డిగ్రీల ఉష్ణోగ్రత కచ్చితంగా ఉండాలనే వినూత్న కథాంశాన్ని ఈ సినిమా కోసం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. టీజర్ చివర్లో వచ్చే 'చనిపోయిన వాళ్లు తిరిగొస్తారా' అనే డైలాగ్ ఆసక్తి రేపుతోంది. ఆర్.ఎక్స్.100 ఫేమ్ శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించాడు. షాలినీ హీరోయిన్గా కనిపించనుంది. అనిల్ విశ్వనాథన్ దర్శకత్వం వహించాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">