ప్రభాస్.. 'సాహో' తర్వాత మరో చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యాడు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. 'జాన్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమచారం. ఈ నెల 18 నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఓ వార్త ఆసక్తి కలిగిస్తోంది.
'జాన్' కోసం 18వ శతాబ్దంలోని యూరప్‌ను తలపించేలా ఖరీదైన 25 సెట్ డిజైన్లు రూపొందించారట. ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ ఇందుకు వేదికైంది. ఇందులో ప్రభాస్-పూజా హెగ్డేల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌తో కలిపి రెబల్ స్టార్ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుమారు రూ.180 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నాడు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: 'జాన్' బాలీవుడ్‌కు వెళ్లడా.. కారణం ఇదేనా..?