తుజే దేఖాతో యే జానా సనమ్.. ప్యార్ హోతా హై దీవానా సనమ్
రుక్జా ఓ దిల్ దివానే.....
న జానే మేరే దిల్ కో....
పాటలు వింటే అరే ప్రేమంటే ఇంత సున్నితంగా, తియ్యగా ఉంటుందా.. మనమూ ప్రేమలో పడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ప్రేమికులంటే కాజల్, షారుఖ్ల్లా కచ్చితంగా ఇలానే ఉండాలి అనిపిస్తుంది.
బాలీవుడ్లో ఎన్ని క్లాసిక్స్ వచ్చినా.. ‘'దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే' స్థానం మాత్రం చెక్కు చెరగనిది. అక్టోబర్ 19, 1995లో విడుదైలన ఈ సినిమా జనరేషన్లతో సంబంధం లేకుండా దశాబ్దాలుగా ప్రేక్షకులని ఉర్రూతలూగిస్తూనే ఉంది. దృశ్యకావ్యం అంటే అర్థం తెలియనివాళ్లు డీడీఎల్జే చూసి తెలుసుకోవాలని సినీ విమర్శకులే ఇప్పటికీ చెబుతుంటారు.
వసూళ్లు, రికార్డులు పక్కన పెడితే 90ల్లో కుర్రకారుని ఈ సినిమా మార్చేసింది. ఓ రకంగా వెండితెర రొమాన్స్‌ని రీ డిఫైన్ చేసిందని చెప్పుకోవచ్చు. ఆ ఏడాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలన్నీ దాదాపు ఈ సినిమావే. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు ఇలా అన్ని ప్రధాన విభాగాలన్నింటిలో అవార్డులు కొల్లగొట్టింది. ముంబయిలోని మరాఠా మందిర్‌లో ఈ సినిమా ఇప్పటికీ ప్రదర్శితమవుతోంది. ఇదో రికార్డు.
ఈ రోజుతో సినిమా విడుదలై 24ఏళ్లైన సందర్భంగా కాజల్ అప్పటి పోస్టర్లోలా పుస్తకం పట్టుకుని చదువుతున్న ఫోజుని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ చిత్రం నెట్టింట సందడి చేస్తోంది.
- View this post on Instagram
Still got the specs & still reading in weird places even after 24 years. #24YearsOfDDLJ
">
ఇవీ చూడండి.. రైలు టికెట్‌కు డబ్బుల్లేక.. ప్రేమలో విఫలమై