ETV Bharat / sitara

స్మార్ట్​ఫోన్​తోనే సినిమా షూటింగ్.. ట్రైలర్​ సూపర్​!

ఓ సినిమాను తెరకెక్కించేందుకు భారీ సాంకేతికతలను వినియోగిస్తున్న ఈ కాలంలో.. కేవలం ఓ స్మార్ట్​ ఫోన్​తో తీసిన ఓ చిత్రం ప్రజల ముందుకు రానుంది. స్మార్ట్​ ఫోన్​తో సినిమా తీయడం ఎలా సాధ్యం? ఇంతకీ ఆ సినిమా పేరేంటి? ఎప్పుడు విడుదల అవుతుంది?

oneplus movie mobile
స్మార్ట్​ఫోన్​తో సినిమా.. ట్రైలర్​ సూపర్​!
author img

By

Published : Nov 21, 2021, 5:36 PM IST

Updated : Nov 21, 2021, 10:29 PM IST

వన్​ప్లస్​ సంస్థ(oneplus movie mobile), ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వానీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సినిమా '2024'(2024 movie). ఈ ఫీచర్​ ఫిల్మ్​ నిడివి 60 నిమిషాలు. ఇందుకు సంబంధించిన ట్రైలర్​ ఇటీవలే విడుదలైంది.

భారీ సాంకేతికతను ఉపయోగించి సినిమాలు తీస్తున్న ఈ కాలంలో.. ఒక్క స్మార్ట్​తోనే చిత్రాన్ని తెరకెక్కించడమా? ఇదెలా సాధ్యం? పిక్చర్​ క్వాలిటీ సరిగ్గా ఉండదేమో? అన్న సందేహాలు వస్తే.. సినిమా కోసం వినియోగిస్తున్న వన్​ప్లస్​ 9 ప్రో స్మార్ట్​ ఫోన్​లోని ప్రత్యేకతలు తెలుసుకోవాల్సిందే.

ఈ ఏడాది తొలిభాగంలో వన్​ప్లస్​ 9 ప్రోను సంస్థ విడుదల చేసింది​. ఈ ఫోన్​లో హాసెల్​బ్లాడ్​ కెమెరాలు ఉంటాయి. హాసెల్​బ్లాడ్​ అనేది కెమెరాలు, లెన్స్​లు తయారు చేయడంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థ. ఇక వన్​ప్లస్​ 9 ప్రోను 48ఎంపీ ఎఫ్​/1.8 సోనీ ఐఎం​ఎక్స్​689 సెన్సార్​, 50ఎంప్​ ఎఫ్​/2.2 సోనీ ఐఎంఎక్స్​766 అల్ట్రా వైడ్​ సెన్సార్​(ఫ్రీఫోం లెన్స్​తో కలిపి), 2ఎంపీ మోనోక్రోమ్​ లెన్స్​తో రూపొందించారు. 8కే లిజల్యూషన్​లో 30ఎఫ్​పీఎస్​(ఫ్రేమ్స్​ పర్​ సెకండ్​) వరకు ఇందులో వీడియోలు రికార్డ్​ చేయవచ్చు.

సాధారణంగా.. యాడ్​ల రూపంలో తమ ప్రోడక్ట్​లకు ప్రచారాలు చేస్తూ ఉంటాయి సంస్థలు. కానీ వన్​ప్లస్​ 9ప్రోను ప్రమోట్​ చేసేందుకు సంస్థ ఏకంగా తన ఫోన్​తోనే సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కరోనా తరహా సంక్షోభం చుట్టూ ఈ సినిమా కథ అల్లుకున్నట్టు ట్రైలర్​ను చూస్తే అర్థమవుతోంది. మరి పూర్తి సినిమాను చూడాలంటే.. ఈ నెల 23 వరకు ఎదురుచూడాల్సిందే. ఆ రోజున డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​లో ఈ చిత్రం విడుదలకానుంది.

ఇదీ చూడండి:- బాక్సింగ్ మధ్యలో విజయ్ గుర్రపు స్వారీ.. అనన్యతో కలిసి

Last Updated : Nov 21, 2021, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.