జూనియర్ ఎన్టీఆర్.. కూచిపూడి నృత్య కళాకారుడు, సినీ యాక్టర్, టెలివిజన్ షో నిర్వాహకుడు, నేపథ్య గాయకుడు. ఇలా అభిరుచి ఉన్న అన్ని రంగాల్లోనూ కృషి చేస్తూ బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తున్నాడు. ఈ హీరో వెండితెరపై హీరోగా అడుగుపెట్టి 18 ఏళ్లు పూర్తి చేసుకొని.. 19వ పడిలోకి అడుగుపెడుతున్నాడు
.
బాల్యంలో కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందడం అతడి నట జీవితానికి ఎంతగానో ఉపయోగపడింది. సినిమాల్లో మంచి డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్నాడు. పాటలకు అడుగులు కదపడం, మాటలకు భావం పలకడం ఈ హీరోకు సొంతం.
తొలి అవకాశం...
1991లో ఎన్టీఆర్... బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా తీస్తున్నారు. ఆ చిత్రంలో మనవడు తారక్‌కు భరతుడి వేషం ఇచ్చి ప్రోత్సహించారు. స్వయంగా తానే మేకప్ వేసి ఎలా నటించాలో మెళకువలు నేర్పారు. ఆ మూవీతో ఎన్టీఆర్ బాల నటుడిగా తెరంగేట్రం చేసినట్లయింది. శబ్దాలయ థియేటర్స్ పతాకంపై కవి, నిర్మాత మల్లెమాల 1996లో నిర్మించిన బాల రామాయణం చిత్రంలో శ్రీరాముడిగా జూనియర్ ఎన్టీఆర్ నటించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
హీరోగా నిన్ను చూడాలని...
ఎందరో కొత్త హీరోలను పరిశ్రమకు పరిచయం చేసిన చరిత్ర.. రామోజీరావు సారథ్యంలోని ఉషా కిరణ్ సంస్థకే సొంతం. ఇదే సంస్థ యువ కథానాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసింది. ఈ నిర్మాణ సంస్థలో వి. ఆర్. ప్రతాప్ దర్శకత్వం వహించిన నిన్ను చూడాలని (2001)సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు తారక్.
వరుస దూకుడు...
2001లో స్టూడెంట్ నంబర్.1 తీసిన రాజమౌళి... ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో హ్యాట్రిక్ కొట్టాడు. 2003లో సింహాద్రి, 2007లో యమదొంగ లాంటి బ్లాక్ బస్టర్లు తీశాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ పేరుతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా మరో ప్రతిష్ఠాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అగ్ర దర్శకులందరితో...
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న అగ్ర దర్శకులందరితోనూ జూనియర్ ఎన్టీఆర్ నటించాడు. వీవీ వినాయక్ తో ఆది, సాంబ, అదుర్స్... బి. గోపాల్ తో అల్లరిరాముడు, నరసింహుడు... డీకే సురేశ్ తో నాగ, పూరి జగన్నాథ్‌తో ఆంధ్రావాలా, టెంపర్... సురేంద్రరెడ్డి తో అశోక్, ఊసరవెల్లి, కృష్ణవంశీ తో రాఖీ, మెహర్ రమేష్ తో కంత్రీ, బోయపాటి శ్రీనుతో దమ్ము, శీను వైట్లతో బాద్ షా, హరీష్ శంకర్ తో రామయ్య వస్తావయ్యా, సంతోష్ శ్రీనివాస్‌తో రభస, సుకుమార్‌తో నాన్నకు ప్రేమతో, కొరటాల శివతో జనతా గారేజ్, కె.ఎస్. రవీంద్రతో జై లవకుశ, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో అరవింద సమేత వీర రాఘవ చిత్రాల్లో కథానాయకుడిగా నటించి మెప్పించాడు తారక్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
విభిన్న పాత్రలు..
జూనియర్ ఎన్టీఆర్ నేపథ్య గాయకుడిగానూ ప్రతిభ కనబరుస్తున్నాడు. ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకత్వంలో యమదొంగ సినిమాలో ఓలమ్మి తిక్కరేగిందా? అన్న పాటకు గళం ఇచ్చాడు. మణిశర్మ సంగీతం అందించిన కంత్రీ సినిమా కోసం వన్ టూ త్రీ నేనొక కంత్రీ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అధ్వర్యంలో అదుర్స్ చిత్రం కోసం చారీ అనే పాటకు, నాన్నకు ప్రేమతో సినిమా కోసం ఫాలో...ఫాలో అన్న పాటకు గళమిచ్చాడు. ఎస్. తమన్ సంగీత దర్శకత్వంలో రభస చిత్రం కోసం రాకాసి...రాకాసి అనే పాటను ఆలపించాడు. ఎస్. తమన్ కన్నడంలో సంగీతం సమకూర్చిన చిత్రం చక్రవ్యూహ కోసం చెలియా..చెలియా అన్న పాటను జూనియర్ ఎన్టీఆర్ పాడాడు. వ్యాఖ్యాతగానూ కనిపించి ప్రేక్షకుల్ని అలరించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పురస్కారాలు...
జూనియర్ ఎన్టీఆర్ చిత్రసీమలో కనబరిచిన ప్రతిభకు అనేక అవార్డులు, పురస్కారాలు దక్కించుకున్నాడు. ఆదిలో నటనకుగాను నంది స్పెషల్ జ్యురీ అవార్డు,యమదొంగ సినిమాలో నటనకుగాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, టెంపర్‌లో యాక్టింగ్‌కు ఉత్తమ నటుడిగా కళాసుధ పురస్కారం, నాన్నకు ప్రేమతో సినిమాకు ఫిలింఫేర్ సౌత్ ఉత్తమ నటుడు పురస్కారం, జనతా గారేజ్ చిత్రానికి ఉత్తమ నటుడిగా సైమా అవార్డు దక్కింది. నాన్నకు ప్రేమతో, జనతా గారేజ్ సినిమాల్లో ప్రదర్శించిన నటనకు ఉత్తమ నటుడిగా... రెండు నందులు జూనియర్ ఎన్టీఆర్ అందుకున్నాడు.