స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సుమంత్, కమలినీ ముఖర్జీ హీరోహీరోయిన్లు కలిసి నటించిన చిత్రం 'గోదావరి'. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి నేటితో 15 ఏళ్లు పూర్తయ్యింది. క్లాసికల్ ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా.. మే 19, 2006న విడుదలైంది. తక్కువ బడ్జెట్‌తో నిర్మితమై.. బాక్సాఫీసు వద్ద క్లాసికల్ హిట్‌గా నిలవడం సహా కమర్షియల్గానూ సక్సెస్ సాధించింది. ఈ సినిమా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హీరో సుమంత్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.
-
#15yearsForGodavari🙏🏼🤍 #Godavari pic.twitter.com/1NpSRKA9zz
— Sumanth (@iSumanth) May 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#15yearsForGodavari🙏🏼🤍 #Godavari pic.twitter.com/1NpSRKA9zz
— Sumanth (@iSumanth) May 19, 2021#15yearsForGodavari🙏🏼🤍 #Godavari pic.twitter.com/1NpSRKA9zz
— Sumanth (@iSumanth) May 19, 2021
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చిన నంది అవార్డుల్లోనూ 'గోదావరి' చిత్రం సత్తా చాటింది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్, ఉత్తమ గాయకురాలు విభాగాల్లో నంది పురస్కారాలను అందుకుంది. అంతేకాదు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఈవెంట్‌లోని ఉత్తమ గేయ రచయిత విభాగంలో అవార్డును దక్కించుకుంది.
ఇదీ చూడండి.. మేకప్‌తో ప్రియమణి.. హాట్‌గా నేహా శర్మ