ETV Bharat / sitara

ఒక్క సినిమాకు వందకు పైగా పురస్కారాలు! - హృతిక్ రోషన్​ వార్తలు

సూపర్​హిట్టయిన సినిమాకు పురస్కారాలు రావడం సాధారణమే! కానీ, బాలీవుడ్​ స్టార్​ హీరో హృతిక్​ రోషన్​ అరంగేట్రం చేసిన 'కహోనా ప్యార్​ హై' సినిమాకు ఏకంగా 102 అవార్డులు లభించాయి. అన్ని పురస్కారాలు లభించడమే కాకుండా బాక్సాఫీసు వద్ద అప్పట్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

102 awards for Hrithik Roshan's Kaho Na Pyar hai movie
ఒక్క సినిమాకు వందకు పైగా పురస్కారాలు!
author img

By

Published : Dec 2, 2020, 7:15 PM IST

సినీపరిశ్రమలో అద్భుతమైన సినిమాలకు ఆదరణ లభించడం మామూలు విషయమే! కానీ, ఓ హిట్టు సినిమా అత్యధిక కలెక్షన్లు రాబట్టడమే కాకుండా వందకు పైగా పురస్కారాలను అందుకుంది. ఇంతకి ఆ చిత్రం ఏది అని అనుకుంటున్నారా? బాలీవుడ్​ స్టార్​ హీరో హృతిక్‌ రోషన్‌ హీరోగా పరిచయమైన 'కహోనా ప్యార్‌ హై' చిత్రం ఈ రికార్డును నెలకొల్పింది. ఏకంగా 102 అవార్డులు దక్కించుకున్న సినిమాగా ఘనత వహించింది.

102 awards for Hrithik Roshan's Kaho Na Pyar hai movie
'కహోనా ప్యార్​ హై' చిత్రంలో అమీషా పటేల్​, హృతిక్​ రోషన్​

హృతిక్‌ తండ్రి రాకేష్‌ రోషన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం 2000 సంవత్సరంలో జనవరి 14న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం అప్పట్లో రూ.10 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై.. ప్రపంచవ్యాప్తంగా రూ.62 కోట్లు వసూళ్లు రాబట్టింది. హృతిక్​ కెరీర్​లో ఈ సినిమా ఓ పెద్ద మలుపు. ఇందులో హృతిక్‌ రోషన్​ సరసన హీరోయిన్​గా అమీషా పటేల్‌ నటించింది.

ఇదీ చూడండి: మీ వదినను పరిచయం చేస్తా.. అభిమానులతో వరుణ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.