ETV Bharat / sitara

సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో కాంప్రమైజ్‌ కావాలన్నాడు!

author img

By

Published : Mar 28, 2021, 7:59 PM IST

రంగుల ప్రపంచం లాంటి సినిమా ఇండస్ట్రీలో ఒక మహిళ రాణించాలంటే ఎన్నో ముళ్ల దారులు దాటాల్సి ఉంటుంది. అవకాశమొస్తే కాటేయాలని చూసే ఎన్నో మృగాలు ఆ దారిలో కాచుకుని ఉంటాయి. వాటి నుంచి తప్పించుకుని తెరపై కనిపించి, అభిమానులు మెచ్చిన నటిగా గుర్తింపు పొందాలంటే అంత సులభమేమీ కాదు. ఈక్రమంలో చాలామందిలాగే తానూ ఎన్నో ముళ్లదారులను దాటాకే సినిమా పరిశ్రమలో నిలదొక్కుకున్నానంటోంది బాలీవుడ్‌ నటి అంకితా లోఖండే.

బాలీవుడ్‌ నటి అంకితా లోఖండే
బాలీవుడ్‌ నటి అంకితా లోఖండే

దివంగత నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రేయసిగా ఎక్కువగా వార్తల్లో నిలిచిన అంకితా లోఖండే.. కెరీర్‌ ప్రారంభంలో తానూ క్యాస్టింగ్‌ కౌచ్‌ బారిన పడ్డానంటోంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకెదురైన కొన్ని చేదు అనుభవాలను అందరితో పంచుకుంది.

గుర్తింపు తెచ్చిన ‘పవిత్ర రిష్తా’!

ఇండోర్‌లోని ఓ మరాఠీ కుటుంబానికి చెందిన అంకిత గ్రాడ్యుయేషన్‌ వరకు చదువుకుంది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ముంబయికి చేరుకుంది. 2006లో ‘జీ సినీ స్టార్స్‌’ రియాలిటీ షోతో బాలీవుడ్‌ బుల్లితెరపై అడుగుపెట్టిన ఆమె.. ఏక్తాకపూర్‌ నిర్మించిన ‘పవిత్ర రిష్తా’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో పాటు ‘ఝలక్‌ దిక్లాజా’, ‘కామెడీ సర్కస్‌’, ‘ఏక్‌ థి నాయ్‌కా’ వంటి రియాలిటీ షోలు, టీవీ కార్యక్రమాలు అంకితను హిందీ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. 2018వరకు బాలీవుడ్‌ బుల్లితెరకు సంబంధించి అత్యధికం పారితోషికం తీసుకునే తారల్లో ఒకరిగా నిలిచిన ఆమె.. ‘మణికర్ణిక’, ‘బాఘీ-3’ వంటి సినిమాలతో వెండితెర ప్రేక్షకులను కూడా మెప్పించింది. అంకితకు ఎంతో గుర్తింపు తెచ్చిన ‘పవిత్ర రిష్తా’ సీరియల్‌తోనే సుశాంత్‌ కూడా సూపర్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. ఆన్‌స్ర్కీన్‌పై అద్భుతమైన కెమిస్ట్రీతో ఆకట్టుకున్న వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో పడ్డారు. సుమారు ఐదేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరు 2016లో వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. అందుకే గతేడాది సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఈమె పేరు కూడా అందరి నోళ్లలో నానింది.

ఛాన్స్ కావాలంటే కాంప్రమైజ్‌ కావాలన్నాడు!

చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల బారిన పడిన ఎంతోమంది తారలు తమకెదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా నోరు విప్పుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో తానూ క్యాస్టింగ్‌ కౌచ్‌ బాధితురాలినేనంటూ ఇటీవలే చెప్పుకొచ్చింది అంకిత. ‘నేను 19-20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే సినిమా పరిశ్రమలోకి వచ్చాను. అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ సమయంలో ఆడిషన్స్‌కి రమ్మని దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. అప్పుడు ఒక స్టార్‌ హీరో నన్ను గదిలోకి పిలిచి సినిమాల్లో ఛాన్స్‌ కావాలంటే నిర్మాతతో కాంప్రమైజ్‌ కావాలన్నాడు. నాకు అసలు విషయం అర్థమైపోయింది. అప్పుడు ‘మీ నిర్మాతతో ఎలా కాంప్రమైజ్‌ కావాలి? నేనేమైనా పార్టీలు, డిన్నర్లకు రావాలా?’ అని ఆ హీరోకు తెలివిగా సమాధానమిచ్చాను. అతడు ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయాడు. అదే సమయంలో ‘మీకు ట్యాలెంటెడ్‌ అమ్మాయి కావాలా? నిర్మాతతో కాంప్రమైజ్‌ అయ్యే అమ్మాయి కావాలా?’ అని అడిగి బయటికొచ్చేశాను.’

క్షమాపణలు చెప్పినా చేయనన్నాను!

‘ఆ తర్వాత వాళ్లు మళ్లీ నన్ను రిక్వెస్ట్‌ చేశారు. జరిగిన దానికి క్షమాపణలు చెప్పి తమ సినిమాలో నటించేందుకు అవకాశం ఇస్తామన్నారు. కానీ నేను మాత్రం నటించనని తెగేసి చెప్పాను’.

వెంటనే చేయి వెనక్కి తీసుకున్నా!

‘ఈ అనుభవం తర్వాత నేను పలు టీవీ సీరియల్స్‌, రియాలిటీ షోలు, కార్యక్రమాలతో బిజీ అయిపోయాను. ప్రత్యేకించి ‘పవిత్ర రిష్తా’ సీరియల్‌ నాకెంతో గుర్తింపు తెచ్చింది. దీంతో మళ్లీ సినిమాల్లో ప్రయత్నిద్దామనుకున్నాను. ఆ సమయంలో నన్ను మొదటిసారి ఇబ్బంది పెట్టిన ఆ స్టార్‌ హీరో మళ్లీ నాకు ఎదురయ్యాడు. ఓ సందర్భంలో నాతో చేయి కలిపేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ స్పర్శ నాకు మరోలా అనిపించింది. వెంటనే చేయి వెనక్కి తీసుకున్నాను. దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి పేరున్న ఓ స్టార్‌ హీరో అలా ప్రవర్తించడంతో ఇక నాకు అక్కడ సినిమా అవకాశాలు రావని అర్థమైంది. నాకు అక్కడ చోటు లేదని భావించి వెనక్కి వచ్చేశాను’ అంటూ తనకెదురైన చేదు అనుభవాలను గుదిగుచ్చింది అంకిత.

ఇవీచూడండి: గూఢచారిగా రాధికా ఆప్టే-'వై' టీజర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.