ETV Bharat / science-and-technology

Youtube Humming Feature : యూట్యూబ్​లో కొత్త ఫీచర్​.. నచ్చిన పాట హమ్​ చేస్తే చాలు.. వెంటనే సాంగ్​ ప్లే! - యూట్యూబ్ హమ్ టు సెర్చ్

Youtube Humming Feature : యూజర్లకు మెరుగైన ఫీచర్లు అందించడంలో ఎప్పుడూ ముందుండే యూట్యూబ్‌.. 'సాంగ్‌ సెర్చ్‌' పేరుతో మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. దాంతోపాటు యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్‌లో కూడా స్వల్ప మార్పులు చేయనుంది. ఇంతకీ ఈ యాప్​ను ఎలా వాడాలంటే?

Youtube Humming Feature
Youtube Humming Feature
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 1:50 PM IST

Youtube Humming Feature : ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా బెస్ట్​ వీడియో వెబ్​సైట్లలో యూట్యూబ్​ ఒకటి. ఇప్పటివరకు చాలా పాపులర్​ అయిన యూట్యూబ్​ను వరల్డ్​వైడ్​గా మిలియన్ల సంఖ్యలో నెటిజన్లు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ వీడియో స్ట్రీమింగ్ యాప్​.. యూట్యూబ్‌ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఆ ఫీచర్​ ఏంటో తెలుసుకుందామా మరి..

సాంగ్​ సెర్చ్​ పేరుతో కొత్త ఫీచర్​..
Youtube Features 2023 : 'సాంగ్‌ సెర్చ్‌' పేరుతో తీసుకొస్తున్న యూట్యూబ్ కొత్త ఫీచర్​ను తీసుకొస్తుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమకు నచ్చిన పాటను సులువుగా వెతకొచ్చు. యూట్యూబ్‌లోని వాయిస్‌ సెర్చ్‌ ఫీచర్‌ ద్వారా సాంగ్‌ సెర్చ్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ సెర్చ్‌లోని హమ్‌ టు సెర్చ్‌ (Hum To Search) ఫీచర్‌ స్ఫూర్తితో ఈ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు యూట్యూబ్‌ తెలిపింది. యూజర్లు తమకు నచ్చిన పాట లేదా మ్యూజిక్‌ కోసం మైక్‌ సింబల్‌పై క్లిక్ చేసి 3 సెకన్లపాటు హమ్‌ చేస్తే.. సెర్చ్‌ రిజల్ట్‌లో ఒరిజనల్‌ పాటతోపాటు, యూజర్‌ క్రియేట్‌ చేసిన కంటెంట్‌, షార్ట్స్‌లోని కంటెంట్‌లో సదరు పాటకు సంబంధించిన వీడియోలను చూపిస్తుంది.

మూడు సెకన్లు హమ్ చేస్తే చాలు..
Youtube Humming Song : ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరిమిత సంఖ్యలో యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు యూట్యూబ్‌ తెలిపింది. 2020 నుంచి గూగుల్‌లో హమ్‌ టు సెర్చ్‌ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు అదే సాంకేతికతతో యూట్యూబ్‌లో సాంగ్‌ సెర్చ్‌ ఆప్షన్‌ అందుబాటులోకి రానుంది. గూగుల్ హమ్‌ టు సెర్చ్‌లో అయితే 15 సెకన్లు హమ్‌ చేయాలి. కానీ, యూట్యూబ్‌లో కావాల్సిన పాట కోసం మూడు సెకన్లు హమ్‌ చేస్తే సరిపోతుంది. దీంతో సహా యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్‌లో యూజర్‌ ఇంటర్‌ ఫేజ్‌కు సంబంధించి కూడా స్వల్ప మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో యూజర్లు సులువుగా సాంగ్​ ట్రాక్‌లను మార్చుకోవచ్చు. అలాగే, క్రోమ్‌ కాస్ట్‌లో మ్యూజిక్‌ యాప్‌ను సులువుగా యాక్సెస్‌ చేసేందుకు వీలుగా కొత్త ఆప్షన్లను యూజర్లకు పరిచయం చేయనుంది.

Youtube Playable : యూట్యూబ్​ నయా ఫీచర్​​.. ఇకపై ఆన్​లైన్​ గేమర్స్​కు పండగే!

YouTube​ బోర్ కొట్టిందా?.. ఈ టాప్ వీడియో సైట్లను ట్రై చేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.