ETV Bharat / science-and-technology

ఎంఐ నుంచి ప్రీమియం స్మార్ట్ టీవీ - ఎంఐ క్యూఎల్​ఈడీ టీవీ ధర అంచనాలు

దేశీయ మార్కెట్లోకి ప్రీమియం స్మార్ట్​ టీవీని విడుదల చేసేందుకు సిద్ధమైంది షియోమీ. ఎంఐ బ్రాండ్ క్యూఎల్​ఈడీ ప్యానెల్​ టీవీని ఈ నెల 16న మార్కెట్లోకి ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్​ టీవీకి సంబంధించిన ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

Mi new premium smart tv launching date
ఎంఐ నుంచి ప్రీమియం స్మార్ట్​ టీవీ
author img

By

Published : Dec 7, 2020, 5:40 PM IST

Updated : Feb 16, 2021, 7:53 PM IST

భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్​ను ఏలుతున్న చైనా కంపెనీ 'షియోమీ' ఇప్పుడు స్మార్ట్​ టీవీల వ్యాపారాలపై దృష్టి సారించింది. ఇప్పటికే స్మార్ట్ టీవీల సెగ్మెంట్​లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఈ కంపెనీ.. ఇప్పుడు ప్రీమియం మోడళ్లనూ దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.

ఇందులో భాగంగా 55 అంగుళాల ఎంఐ బ్రాండ్.. క్యూఎల్​ఈడీ టీవీని ఈ నెల 16న మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. ఈ టీవీ పూర్తిగా భారత్​లోనే అసెంబుల్​ చేసినట్లు పేర్కొన్నారు. టీవీ ఫీచర్లు, ధర వంటి వివరాలు మాత్రం వెల్లడించలేదు.

అయితే ఎంఐ వెబ్​సైట్లో ఉన్న సమాచారం ప్రకారం.. కొత్త స్మార్ట్ టీవీలో 4కే రెసొల్యూషన్స్, డాల్బీ ఆడియో సపోర్ట్​ వంటివి ఉండనున్నట్లు తెలిసింది.

టీవీల మార్కెట్​లో ఎంఐ వాటా..

ఎంఐ స్మార్ట్ టీవీలు వరుసగా తొమ్మిదో త్రైమాసికంలోనూ బెస్ట్​ సెల్లింగ్​ డివైజ్​లుగా నిలిచినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఏడాది రెండో త్రైమాసింకంలో 22 శాతం మార్కెట్ వాటాను దక్కించుకున్నట్లు వెల్లడించింది. 2018లో దేశ స్మార్ట్​ టీవీ మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 50 లక్షల యూనిట్లకుపైగా విక్రయించినట్లు వివరించింది.

ఇదీ చూడండి:గూగుల్​పే, పేటీఎంకు పోటీగా ఐసీఐసీఐ యాప్​

Last Updated : Feb 16, 2021, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.