ETV Bharat / science-and-technology

Xiaomi Glasses: షియోమీ స్మార్ట్‌గ్లాసెస్‌.. స్క్రీన్ కాదు మరో స్మార్ట్‌ఫోన్‌ - షియోమీ స్మార్ట్‌గ్లాసెస్‌లో నేవిగేషన్​

చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ సరికొత్త ఉత్పత్తిని తీసుకొచ్చింది. ఇప్పటికే ఫిట్‌నెస్‌ బ్యాండ్, స్మార్ట్‌వాచ్‌లతోపాటు ప్రజల్ని ఆకట్టుకున్న ఈ సంస్థ స్మార్ట్‌ గ్లాసెస్‌ను (Xiaomi Glasses) ఇప్పడు విడుదల చేసింది. ఇంతకీ దీని ప్రత్యేకతలు ఏంటంటే?

Xiaomi smart glasses
షియోమీ స్మార్ట్‌గ్లాసెస్‌
author img

By

Published : Sep 17, 2021, 12:50 PM IST

షియోమీ కంపెనీ స్మార్ట్‌ వేరబుల్స్‌ శ్రేణిలో మరో కొత్త ఉత్పత్తిని విడుదల చేసింది. ఇప్పటికే ఫిట్‌నెస్‌ బ్యాండ్, స్మార్ట్‌వాచ్‌లతోపాటు గృహోపకరణాలను విడుదల చేసిన షియోమీ.. ఇప్పుడు స్మార్ట్‌ గ్లాసెస్‌ను (Xiaomi Glasses) తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్‌గ్లాసెస్‌ మోడల్స్‌కు భిన్నంగా సరికొత్త ఫీచర్స్‌ ఇందులో పరిచయం చేసినట్లు తెలిపింది. షియోమీ స్మార్ట్‌గ్లాసెస్‌లో మైక్రో ఎల్‌ఈడీ ఆప్టికల్ వేవ్‌గైడ్ సాంకేతికతను ఉపయోగించారు. దీంతో స్మార్ట్‌గ్లాసెస్‌ మెసేజ్‌లు, నోటిఫికేషన్లు, నేవిగేషన్, కాలింగ్, ఫొటో, ట్రాన్స్‌లేషన్ వంటి సర్వీసులను యూజర్‌కు అందిస్తుంది. షియోమీ స్మార్ట్‌గ్లాసెస్‌లో క్వాడ్‌కోర్ ఏఆర్‌ఎమ్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ ఓఎస్‌ సాయంతో ఈ స్మార్ట్‌గ్లాసెస్ పనిచేస్తాయి.

Xiaomi smart glasses
షియోమీ స్మార్ట్‌గ్లాసెస్‌
Xiaomi smart glasses
ఫ్రేమ్‌లో ఉన్న 5 ఎంపీ కెమెరా

ఈ గ్లాసెస్‌కు ఎడమవైపు ఫ్రేమ్‌లో 5 ఎంపీ కెమెరా అమర్చారు. దీని సాయంతో యూజర్‌ ఫొటోలు తీయడం సహా, ఫొటోలోని టెక్ట్స్‌ను ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. అలానే కుడివైపు గ్లాస్‌లో 0.13 అంగుళాల మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇది ఫోన్‌ కాల్స్‌, నావిగేషన్‌, నోటిఫికేషన్స్‌, ఫొటో వంటి వాటిని స్క్రీన్‌పై చూపిస్తుంది. షియోమీ ఏఐ అసిస్టెంట్ సాయంతో యూజర్‌ ఈ స్మార్ట్‌గ్లాసెస్‌ను ఉపయోగించవచ్చు. ఫోన్‌కాల్, నోటిఫికేషన్, ఫొటో ట్రాన్స్‌లేషన్‌ వంటి కమాండ్స్‌తో స్మార్ట్‌గ్లాసెస్‌ సేవలను యూజర్ పొందొచ్చు. స్మార్ట్‌ఫోన్‌ను గ్లాసెస్‌కు అనుసంధానించుకుంటే ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్స్‌ స్మార్ట్‌గ్లాసెస్‌లో చూడొచ్చు. కాల్స్‌ మాట్లాడుకునేందుకు ఇందులో మైక్రోఫోన్, స్పీకర్ ఇస్తున్నారు. ఇందులో మొత్తం 497 కాంపోనెంట్స్ ఉపయోగించారు.

Xiaomi smart glasses
మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే
Xiaomi smart glasses
షియోమీ స్మార్ట్‌గ్లాసెస్‌లో నావిగేషన్‌

ఇది కేవలం స్మార్ట్‌ఫోన్‌కు రెండో స్క్రీన్‌లా మాత్రమే కాకుండా మరో స్మార్ట్‌ఫోన్‌లా పనిచేస్తుందని షియోమీ తెలిపింది. ఇవి కేవలం 51 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. కొద్ది రోజుల క్రితం ఫేస్‌బుక్-రేబాన్ సంయుక్తంగా స్మార్ట్‌గ్లాసెస్‌ను ఆవిష్కరించాయి. అంతకుముందే గూగుల్, స్నాప్‌ఛాట్, లెనోవా, ఫౌనా కంపెనీలు కూడా స్మార్ట్‌గ్లాసెస్‌ను మార్కెట్లోకి విడుదల చేశాయి. తాజాగా ఈ జాబితాలో షియోమీ స్మార్ట్‌గ్లాసెస్ చేరాయి. అయితే వీటిని మార్కెట్లోకి ఎప్పుడు విడుదల చేస్తారు.. ధరెంత వంటి విషయాలపై సంస్థ ప్రకటన చేయాల్సివుంది.

ఇదీ చూడండి: iPhone 13 Series: ఐఫోన్​ 13 సిరీస్​ టాప్​ 10 హైలైట్స్ ఇవే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.