X Job Hiring Feature : ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ (ట్విట్టర్) ఎప్పటి నుంచో ఊరిస్తున్న జాబ్ హైరింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వెరిఫైడ్ ఆర్గనైజేషన్స్ ఇందులో ఉద్యోగ ప్రకటనలు చేసుకోవచ్చు. అలాగే యూజర్లు కూడా చాలా సులువుగా జాబ్ నోటిఫికేషన్లను తెలుసుకోవచ్చు. అలాగే ఇదే వేదిక నుంచి ఆయా పోస్టులకు అప్లై కూడా చేసుకోవచ్చు.
వెరిఫైడ్ ఆర్గనైజేషన్స్‌కు మాత్రమే!
X Hiring Feature Eligibility Criteria : ఎక్స్ తీసుకొచ్చిన ఈ నయా జాబ్ హైరింగ్ ఫీచర్.. ప్రస్తుతం ధ్రువీకరణ పొందిన సంస్థలు మాత్రమే ఉపయోగించడానికి వీలవుతుంది. దీని ద్వారా ఆయా సంస్థలు తమ ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్స్‌లో ఉద్యోగ ప్రకటనలు జారీ చేయవచ్చు.
-
Unlock early access to the X Hiring Beta — exclusively for Verified Organizations.
— Hiring (@XHiring) August 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Feature your most critical roles and organically reach millions of relevant candidates.
Apply for the Beta today 🚀: https://t.co/viOQ9BUM3Y pic.twitter.com/AYzdBIDjds
">Unlock early access to the X Hiring Beta — exclusively for Verified Organizations.
— Hiring (@XHiring) August 25, 2023
Feature your most critical roles and organically reach millions of relevant candidates.
Apply for the Beta today 🚀: https://t.co/viOQ9BUM3Y pic.twitter.com/AYzdBIDjdsUnlock early access to the X Hiring Beta — exclusively for Verified Organizations.
— Hiring (@XHiring) August 25, 2023
Feature your most critical roles and organically reach millions of relevant candidates.
Apply for the Beta today 🚀: https://t.co/viOQ9BUM3Y pic.twitter.com/AYzdBIDjds
"ఎక్స్ హైరింగ్ బీటా వెర్షన్‌ను ముందస్తుగా అన్‌లాక్ చేసుకోండి. ముఖ్యంగా వెరిఫైడ్ ఆర్గనైజేషన్స్‌కు ఇది అందుబాటులో ఉంటుంది. ఈ జాబ్ హైరింగ్ ఫీచర్ ద్వారా మిలియన్ల సంఖ్యలో ఉన్న ఉద్యోగార్థులను చేరుకోవచ్చు. కనుక ఈ రోజే బీటా వెర్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి."
- ఎక్స్ హైరింగ్ ట్వీట్
ఎక్స్ హైరింగ్ ఫీచర్స్ :
X Hiring Feature For Job Search :
- ఎక్స్ హైరింగ్ టూల్ అనేది ఆయా సంస్థలు.. అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ (ATS) లేదా XML ఫీడ్‌ను ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది. దీని ద్వారా ఆయా కంపెనీలు తమ ఉద్యోగ ప్రకటనలు ఈ వేదికలోనే చేసుకునే వీలు కలుగుతుంది.
- ఈ ఫీచర్ వాడాలంటే.. ఆయా సంస్థలు కచ్చితంగా ఎక్స్ ప్లాట్‌ఫాంలో ధ్రువీకరణ పొంది ఉండాలి. అలాగే నెలవారీగా 1000 డాలర్లు (సుమారు రూ.82,000) కూడా చెల్లించాలి.
- జాబ్ హైరింగ్ ఫీచర్ ఎనేబుల్ చేసుకున్న సంస్థలు.. తమ ఎక్స్ ప్రొఫైల్స్‌లో జాబ్ వేకెన్సీస్ (ఉద్యోగ ప్రకటనలు) చేయవచ్చు.
- ఉద్యోగార్థులు.. కీవర్డ్స్, లొకేషన్, జాబ్ నేమ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొదలైన సెర్చ్వర్డ్స్తో ఉద్యోగ ప్రకటనలను సెర్చ్ చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అభ్యర్థులు నేరుగా ఎక్స్ ప్లాట్‌ఫాంలోనే ఆయా పోస్టులకు దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.
- సంస్థలు కూడా తాము ఉద్యోగాలకు ఎంపిక చేసిన అభ్యర్థులను.. నేరుగా ఈ ఎక్స్ ప్లాట్‌ఫాంలోనే కాంటాక్ట్ అయ్యి.. నియామకాలు చేసుకోవడానికి వీలవుతుంది.
బీటా వెర్షన్
X Hiring Beta Version : ప్రస్తుతం ఎక్స్ హైరింగ్ ఫీచర్ బీటా వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ త్వరలోనే ఇది అందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే కనుక అందుబాటులోకి వస్తే.. లింక్డ్ ఇన్ లాంటి ప్రొఫిషనల్ జాబ్ పోర్టల్స్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంటుంది.