X Calling Feature : సోషల్ మీడియా సంస్థ ఎక్స్ (గతంలో ట్విటర్)లో ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్లను అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ఈ ఫీచర్ల యాక్టివేషన్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా ఆయన షేర్ చేశారు. ప్రస్తుతానికి కొందరు యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ను 'ఎవ్రీథింగ్' యాప్‌గా మార్చటంలో భాగంగానే వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్లను తీసుకురానున్నట్లు ఎలాన్ మస్క్ కొన్ని నెలల క్రితమే ప్రకటించారు. ఈ ఫీచర్ సాయంతో ఫోన్ నంబర్ లేకుండానే ఎక్స్‌లో కాల్స్ మాట్లాడవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్, పీసీలు ఈ కాలింగ్ ఫీచర్ సపోర్ట్ చేస్తాయి. అయితే ఈ ఫీచర్లను ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?
- ముందుగా ఎక్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి
- ఆ తర్వాత Privacy & Safety ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
- ఆ తర్వాత Direct Messages ఆప్షన్‌ను ఎంచుకోవాలి
- Enable Audio & Video Calling ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి
-
Early version of video & audio calling on 𝕏 https://t.co/aFI3VujLMh
— Elon Musk (@elonmusk) October 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Early version of video & audio calling on 𝕏 https://t.co/aFI3VujLMh
— Elon Musk (@elonmusk) October 25, 2023Early version of video & audio calling on 𝕏 https://t.co/aFI3VujLMh
— Elon Musk (@elonmusk) October 25, 2023
-
ఇక అందరూ డబ్బులు కట్టాల్సిందే!
X Subscription Fee : కొన్ని రోజుల క్రితం.. ఎక్స్ యూజర్లకు మస్క్ షాక్ ఇచ్చారు. త్వరలోనే ఎక్స్ ఖాతాదారులు అందరి నుంచి నెలవారీ సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే కనుక అమలు జరిగితే యూజర్లపై అదనపు ఆర్థిక భారం పడడం ఖాయం. సబ్స్క్రిప్షన్ ఫీజు విధిస్తామని స్పష్టం చేసిన ఎలాన్ మస్క్.. అది ఎంత మేరకు ఉంటుందనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అలాగే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నవారికి అదనపు ఫీచర్లు కల్పిస్తారా? లేదా? అనే విషయాన్ని కూడా వెల్లడించలేదు. ప్రస్తుతం ఎక్స్ వేదికలో 550 మిలియన్లకు పైగా మంత్లీ యూజర్స్ ఉన్నారని ఎలాన్ మస్క్ తెలిపారు. వీరు ఒక రోజులో కనీసం 100 నుంచి 200 మిలియన్ల పోస్టులు పెడుతున్నారని ఆయన వివరించారు. ఒక వేళ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అమలులోకి వస్తే.. ట్విట్టర్ (ఎక్స్) కంపెనీకి భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుంది.