గోప్యత నిబంధనల మార్పుపై యూజర్లలో తలెత్తుతున్న అన్ని సందేహాలకు సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వాట్సాప్ స్పష్టం చేసింది. ఏకపక్షంగా తీసుకొచ్చిన నిబంధనల మార్పులను ఉపసంహరించుకోవాలని వాట్సాప్‌కు కేంద్రం లేఖ రాసిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడింది.
వాట్సాప్ ఇటీవల తీసుకొచ్చిన నూతన సేవా నిబంధనలు, గోప్యత ప్రమాణాల్లో మార్పులపై కేంద్రం మంగళవారం వాట్సాప్ సీఈఓకు ఓ లేఖ రాసింది. అందులో 14 ప్రశ్నలను సంధించింది. కొత్త నిబంధనలను ఊపసంహరించుకోవాలని సూచించింది.
కొత్త అప్డేట్ ఉద్దేశం యూజర్ల డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకోవడం కాదని స్పష్టం చేసింది వాట్సాప్. మరింత పారదర్శకంగా, కొత్త సదుపాయాలతో వ్యాపారులు వినియోగదారులతో అనుసంధానమయ్యేలా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని వివరించింది. దీనితో వ్యాపారులు సులభంగా సేవలందించగలుగుతారని పేర్కొంది.
వాట్సాప్ సందేశాలు ఎల్లప్పుడూ ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్తో భద్రంగా ఉంటాయని.. వాటిని తాము గానీ ఫేస్బుక్ గానీ చూసేందుకు వీలుండదని వాట్సాప్ ప్రతినిధి మరోసారి గుర్తు చేశారు.
'తప్పుడు సమాచారం ఎలా వస్తుందో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. యూజర్లలో తలెత్తే ఎలాంటి సందేహాలకైనా సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.' అని వాట్సాప్ వివరణ ఇచ్చింది.
ఇవీ చూడండి: