ETV Bharat / science-and-technology

సెర్చ్ ఇంజిన్లందు గూగుల్​ వేరయా! కానీ ఎందుకు?

సెర్చ్​ ఇంజిన్ అనగానే చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది గూగుల్. ఎందుకంటే.. గూగుల్​నే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తారు. అయితే దీనితోపాటు ఇతర సెర్చ్ ఇంజిన్స్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వాటి పేర్లేమిటి? అన్నింటిలో గూగుల్​కే ఎందుకుంత క్రేజ్?

Why Google much popular
గూగుల్​కు ఎందుకంత క్రేజ్​
author img

By

Published : Aug 9, 2021, 7:26 PM IST

సెర్చ్ ఇంజిన్ అంటే గూగుల్.. గూగుల్ అంటే సెర్చ్ ఇంజిన్.. అనేంతలా పాపులారిటీ సంపాదించింది ఆ సంస్థ. సాంకేతికంగా సెర్చ్ ఇంజిన్ అనే పదం తెలియకపోయినా.. గూగుల్ గురించి తెలియని వారు చాలా అరుదు. అంటే ఒక రకంగా సెర్చ్ ఇంజిన్​కు.. గూగుల్ పర్యాయపదంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చాలా మందికి గూగుల్​ తప్ప మరో సెర్చ్ ఇంజిన్ ఉందనే విషయం కూడా తెలియదు.

ఒక అంచనా ప్రకారం ప్రతి వంద సెర్చ్​లలో 90.. గూగుల్ ద్వారానే అవుతాయి. సెకన్​కు 40వేల సెర్చ్​లు గూగుల్ ద్వారా జరుగుతాయి.

సెర్చ్​ ఇంజిన్​ విభాగంలో.. ఒకప్పుడు మార్కెట్ లీడర్​గా ఉన్న యాహూను వెనక్కి నెట్టి.. స్వల్పకాలంలోనే గూగుల్ అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. పలు ఇతర సెర్చ్ ఇంజిన్లు గూగుల్​కు పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా.. ఇప్పట్లో అది సాధ్యం కాకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇతర సెర్చ్ ఇంజిన్లు..

గూగుల్​తో పాటు చాలా సెర్చ్ ఇంజిన్లు ఇంటర్నెట్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గవి మైక్రోసాఫ్ట్​కు చెందిన బింగ్, యాహూ, డక్​డక్ గో, ఆస్క్. ఇందులో డక్ డక్ గో ప్రైవసీకి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. కొన్ని దేశాల్లో స్థానిక సెర్చ్ ఇంజిన్లను ఉపయోగిస్తారు. ఉదాహరణకు చైనాలో 'బైడూ'ను ఉపయోగిస్తారు.

ఎందుకంత క్రేజ్​..?

గూగుల్ పాపులారిటీ సంపాదించుకోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు టాప్ సెర్చ్ ఇంజిన్​గా ఉన్న యాహూలో ప్రకటనలు ఎక్కువగా వచ్చేవి. ఇది యూజర్లకు కాస్త ఇబ్బందిగా అనిపించేది. ఈ విషయాన్ని గూగుల్ పూర్తిగా మార్చేసింది. తక్కువ ప్రకటనలతో యూజర్ ఫ్రెండ్లీగా సెర్చ్ పేజీలో సమూల మార్పులు చేసింది. దీనితో యూజర్లు గూగుల్​వైపు మొగ్గు చూపటం ప్రారంభించారు.

ఈజీ సెర్చ్​..

యూజర్లు సెర్చ్​ చేసే అంశంతో పాటు దానికి సంబంధించిన ఫలితాలను చూపడం, సెర్చ్​ ఫలితాల్లో వేగం వంటివి గూగుల్​కు కలిసొచ్చాయి. లొకేషన్ ఆధారంగా.. ప్రదేశాన్ని బట్టి ఫలితాలు ఇవ్వటం అదనపు ఆకర్షణగా మారాయి.

సెర్చ్ విషయంలో ఇమేజ్​లు, వీడియోలు, మ్యాప్స్, ఇలా ఒకదాని తర్వాత మరో విభాగాన్ని జోడిస్తూ.. వచ్చింది గూగుల్​. వెబ్ సైట్లలో ప్రకటనలు ఇచ్చేందుకు యాడ్ వర్డ్స్ లాంటి సులభమైన ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది. దీనితో ఇది వ్యాపారులకు మరింత చేరువైంది. ఇవన్నీ విజయం సాధించిన నేపథ్యంలో.. ఇంటర్నెట్​ ఆధారంగా పని చేసే అనేక సర్వీసులను పరిచయం చేసింది గూగుల్​.

ఇంటర్నెట్​కు సంబంధించి గూగుల్ అనేక రకాల ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్​ఫోన్లలో అధికంగా వినియోగిస్తున్న ఆండ్రాయిడ్​ ఆపరేటింగ్ సిస్టమ్ గూగుల్​కు చెందినదే. దీనితో పాటు రీసెర్చ్​ అండ్ డెవలప్​మెంట్​పై అధికంగా ఖర్చు చేస్తూ.. అధునాతన అవసరాలకు తగ్గట్లు కొత్త కొత్త సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఈ కారణంగా భవిష్యత్​లోనూ గూగుల్​ ఇదే స్థాయిలో దూసుకుపోతుంది అని నిపుణులు అంటున్నారు.

ఇదీ చదవండి: Microsoft: విండోస్‌ 10 కొత్త ఫీచర్.. ఇక బ్రౌజింగ్​ భద్రంగా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.